పరారిలో ఉన్న దొంగను పట్టించిన బంగారు పళ్లు 15 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ వ్యక్తిని అతని నోట్లోని బంగారు పూత పూసిన పళ్లు పట్టించాయి. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసే ప్రవీణ్ అశుభ జడేజా.. 2007లో బట్టల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తూ.. షాపు యజమాని అని చెప్పుకొని రూ.40వేలు కాజేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కానీ బెయిల్ మీద బయటికొచ్చిన ప్రవీణ్.. ముంబై నుంచి పారిపోయి గుజరాత్ లోని కచ్ లో స్థిరపడ్డాడు. దీంతో కోర్టు అతన్ని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది.
ప్రవీణ్ 2007లో ఒక బట్టల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేసేవాడు. అతని యజమాని ఒకసారి మరో వ్యాపారి నుండి రూ. 40వేలు వసూలు చేయమని అడిగాడు. ఆ డబ్బును తన యజమానికి ఇవ్వడానికి బదులుగా.. ప్రవీణే ఆ డబ్బుని తన దగ్గర ఉంచుకొని, పోలీసులను, యజమానిని తప్పుదోవ పట్టించాడు. కానీ కొద్ది రోజుల్లోనే పోలీసులు ప్రవీణ్ ని అరెస్టు చేశారు. అలా అప్పట్నుంచి పరారీలో ఉన్న ప్రవీణ్ ను.. అతని సహచరుల సాయంతో మాండ్విలోని సబ్రాయ్ గ్రామంలో దాక్కున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ నోటిలో ఉన్న రెండు బంగారు పూత పూసిన పళ్ల సాయంతో అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
©️ VIL Media Pvt Ltd.