మిసెస్ ఇండియా విన్నర్​గా తెలంగాణ మహిళ

మిసెస్ ఇండియా విన్నర్​గా తెలంగాణ మహిళ  న్యూఢిల్లీ, వెలుగు: రాజస్థాన్ వేదికగా జరిగిన మిసెస్ ఇండియా – 2023 పోటీల్లో మన రాష్ట్రానికి చెందిన మహిళ విన్నర్ గా నిలిచారు. క్లాసికల్ కేటగిరి (40–60 వయసు) లో హైదరాబాద్​కు చెందిన డాక్టర్ శ్రీవర్షిణి సార్వభౌమ  గెలుపొందారు. రాజస్థాన్ లోని రణతంబోర్​​లో జరుగుతున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఫైనల్​లో విజేతగా నిలిచిన శ్రీవర్షిణి 2023లో అంతర్జాతీయ వేదికపై జరిగే అందాల పోటీల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించనున్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు చెందిన శ్రీవర్షిణి ప్రస్తుతం యూకేలోని బ్లాక్ పుల్ టౌన్​లో డాక్టర్​గా పనిచేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *