వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు.. హోం లోన్‌పై మాత్రం బంపర్ ఆఫర్.. వారికి మాత్రమే..!

Loan EMI: మళ్లీ సామాన్యులపై భారం పడుతోంది. RBI ఇటవల రెపో రేటును పెంచిన తర్వాత.. ఈ భారాన్ని కస్టమర్లపై బదిలీ చేస్తు్న్నాయి బ్యాంకులు. వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో EMIలు మరింత భారం అవుతాయి. కొత్తగా లోన్లు పొందేవారికి కట్టాల్సిన EMI పెరగనుండగా.. ఇప్పటికే లోన్లు పొందినవారికి మాత్రం EMI కట్టాల్సిన నెలలు పెరుగుతాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచిన రోజు వ్యవధిలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను పెంచగా.. ఇప్పుడు మరో రెండు బ్యాంకులు అదే బాటలో పయనించాయి. ఫిబ్రవరి 8న రెపో రేటును పెంచింది రిజర్వ్ బ్యాంక్.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మార్జినల్ కాస్ట్స్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) అంటే రుణ ఆధారిత వడ్డీ రేటును పెంచింది. ఇది ఫిబ్రవరి 11 నుంచే అమల్లోకి వస్తుందని, ఈ ఏడాది మార్చి 10 వరకు పెంచిన వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. బ్యాంక్ EBLR ఇప్పుడు అంటే ఫిబ్రవరి 11 నుంచి 9.30 శాతం వద్ద ఉండనుంది.

స్టాక్‌మార్కెట్లో లక్షల కోట్లు ఆవిరి.. సుప్రీం కోర్టు సీరియస్.. కేంద్రం, సెబీ ఏం చేస్తుందంటూ..!

ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR రేటు 7.90 శాతానికి చేరింది. ఇక ఒక నెల, 3 నెలలు, 6 నెలల MCLR రేటు వరుసగా 8.05 శాతం, 8.25 శాతం, 8.45 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ రేటు 9 శాతం, రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.85 శాతంగా, ఏడాది వ్యవధి ఉన్న ఎంసీఎల్‌ఆర్ రేటు 8.65 శాతంగా ఉంది.

అదానీ కీలక నిర్ణయం.. హిండెన్‌బర్గ్‌ను గట్టి దెబ్బ కొట్టేలా ఈసారి పక్కా ప్లాన్‌తో.. అన్ని దారులు మూసుకుపోయేలా..!

కెనరా బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఫిబ్రవరి 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లో స్పష్టం చేసింది. బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్లు 9.40 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇక ఇదే సమయంలో కెనరా బ్యాంక్ గృహ రుణాలపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. 9.40 శాతం వడ్డీ రేటుగా ఉన్న హోం లోన్లపై 0.25 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

Read Latest

Business News and Telugu News

Also Read:

ఆధార్‌ను వెరిఫై చేస్తున్నారా లేదా? లేకుంటే ఆ కార్డులన్నీ క్యాన్సిల్.. ఈ సింపుల్ స్టెప్స్‌తో..

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *