వైసీపీలో మాజీ ఎమ్మెల్యే సైలెంట్.. మళ్లీ టీడీపీలోకి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొద్దిరోజులుగా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో పార్టీల్లోకి చేరికలు మొదలవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కొందరు టీడీపీలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం కూడా వెంటనే రంగంలోకి దిగింది.. అక్కడ పరిస్థితులకు చెక్ పెట్టింది. అయితే ఈలోపు నంద్యాల జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

వైఎస్సార్‌సీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి (Bijjam Parthasaradhi Reddy) దారెటు అనే చర్చ మొదలైంది. బనగానపల్లెలలో కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరండగా ఉండటంతో.. విభేదాలు మొదలయ్యాయా అనే చర్చ జరుగుతోంది. పార్థసారథిరెడ్డి సొంత మండలం అవుకులో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ గృహ సారథులు, బూత్‌ కన్వీనర్ల ముఖ్య నాయకుల సమావేశానికి హాజరుకాలేదు. ఆయన సొంత గ్రామం నుంచి అసలు లిస్ట్ ఇవ్వలేదట. దీంతో బిజ్జం అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది.

బిజ్జం పార్థసారథిరెడ్డి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలతో విభేదాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. స్థానికంగా కాటసాని, చల్లా కుటుంబంతో గ్యాప్ ఉందని చెబుతున్నారు. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. రెండు, మూడు నెలలో పార్టీ మారతారని చెప్పుకుంటున్నారు. అలాగే బనగానపల్లె టీడీపీ ఇంఛార్జ్ బీసీ జనార్దన్‌రెడ్డికి బిజ్జం బంధువు కావడంతో టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా బిజ్జం వర్గం పేరుతో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

బిజ్జం పార్థసారథిరెడ్డి సొంత ఊరు అవుకు మండలం చెన్నంపల్లె కాగా.. ఆయన 1999లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డిపై 21,246 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.2004 ఎన్నికల్లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతిలో 4592 ఓట్లతో ఓటమి ఎదురైంది. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో పార్థసారథిరెడ్డి యాక్టివ్ అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలవడంతో టీడీపీలోకి వస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా బిజ్జం మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *