నాగ్‌పూర్ టెస్టు (Nagpur Test)లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలోనే నోరుజారాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (Steve Smith)ని ఉద్దేశిస్తూ పాగల్ అంటూ తిట్టడం స్టంప్ మైక్‌లో రికార్డైంది. దాంతో రోహిత్ ముందు ఉన్న రవీంద్ర జడేజా నవ్వేస్తూ కనిపించాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇంతకీ స్మిత్‌ని తిట్టేంత కోపం రోహిత్ శర్మకి ఎందుకు వచ్చిందంటే? ప్రమాదకరంగా అతనిపైకి స్మిత్ బంతిని త్రో చేయడమేనని తెలుస్తోంది.
మ్యాచ్‌లో శుక్రవారం సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ (120: 212 బంతుల్లో 15×4, 2×6) కొన్ని గంటలు క్రీజులో నిలిచాడు. దాంతో హిట్‌మ్యాన్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు స్టీవ్‌స్మిత్ ఉద్దేశపూర్వకంగానే రోహిత్‌పైకి బంతిని త్రో చేసినట్లు కనిపించింది. ఆఖరి క్షణంలో బంతి తనపైకి రావడాన్ని చూసిన రోహిత్ శర్మ వేగంగా పక్కకి తప్పుకున్నాడు. అనంతరం జడేజాతో మాట్లాడుతూ ‘ఏ పాగల్ హై థోడా’ అంటూ విసురుగా చెప్తూ కనిపించాడు. మ్యాచ్‌లో జడేజా కూడా 171 బంతుల్లో 10×4, 1×6 సాయంతో 84 పరుగులు చేశాడు.
స్టీవ్‌స్మిత్‌పై భారత క్రికెటర్లు కోప్పడటం ఇదేమీ తొలిసారి కాదు. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఓ 3-4 సందర్భాల్లో స్మిత్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నాగ్‌పూర్ టెస్టులోనే రవీంద్ర జడేజా బౌలింగ్ ఇబ్బందిపడిన స్టీవ్‌స్మిత్.. పొగుడుతూ సైగలు చేస్తూనే వెటకారం కూడా చేశాడు. దాంతో జడేజా ఓ స్టన్నింగ్ డెలివరీతో అతడ్నీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్రీజులో భిన్నమైన స్టాన్స్ తీసుకునే స్మిత్.. బంతిని డిఫెన్స్ చేసిన తర్వాత బౌలర్‌ని చూస్తూ వెటకారంగా బ్యాట్‌ని వెనక్కి తీస్తుంటాడు.
Read Latest
Sports News
,
Cricket News
,