హోం లోన్లపై వడ్డీల మోత.. సింపుల్ చిట్కాలతో భారాన్ని తొందరగా తగ్గించుకోండిలా..

Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఇటీవల మరో 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో మొత్తం రెపో రేటు అనేది 6.50 శాతానికి పెరగడం గమనార్హం. RBI రెపో రేటును పెంచిన నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు అన్నీ కూడా అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లను ఎప్పుడెప్పుడు పెంచాలా అని కళ్లరిగేలా ఎదురుచూస్తున్నాయి. చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి కూడా. సాధారణంగా భారత్‌లో ఇల్లు కట్టుకోవడం చాలా మందికి కల. దీంతో.. వారు డబ్బుల కోసం లోన్లపై ఆధారపడుతుంటారు. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగాయి కాబట్టి హోం లోన్లు మరింత భారంగా మారుతున్నాయి. నెలవారీగా వాయిదాలు ఎక్కువ చెల్లించడం, ఎక్కువ కాలం చెల్లించాల్సి రావడం వంటివి లోన్లు తీసుకునేవారికి సవాల్ విసురుతున్నాయి.

దీంతో రుణ గ్రహీతలు తమ లోన్లను తొందరగా తీర్చాలని చూస్తున్నారు. ఇందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. హోం లోన్ త్వరగా తీర్చుకునేందుకు ఏం మార్గాలు అనుసరించాలో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

2022, మేలో రెపో రేటు 4 శాతంగా ఉండగా.. ఇప్పుడది 6.50 శాతానికి చేరింది. అంటే 2.50 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మీరు మే నెలలో 6.5 శాతం వద్ద తీసుకున్న రెపో లింక్డ్ హోం లోన్.. ఇప్పుడు ఏకంగా 9 శాతానికి చేరిందన్నమాట. పెరిగిన వడ్డీతో లెక్కిస్తే గనుక.. మీరు అప్పట్లో 20 ఏళ్ల కాలవ్యవధికి తీసుకున్న గృహ రుణం ఇప్పుడు 30 ఏళ్లయినా తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకొన్ని EMI లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు చెల్లింపులతో కాస్త ఉపశమనం లభిస్తుంది.

97814961

మీరు ఇప్పుడు హోం లోన్‌కు చెల్లిస్తున్న EMI ల మొత్తాన్ని సంవత్సరానికి ఒకసారైనా మీ వీలును బట్టి.. 5-10 శాతం మేర పెంచుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది. ఆదాయం పెరిగిన సమయాల్లో ఇలా చేయండి. దీంతో మీరు ఈఎంఐ కట్టాల్సిన కాలం కొంత తగ్గుతుంది. ఇలా ఎక్కువ సార్లు ఈఎంఐ ఎక్కువ కట్టుకుంటూ పోతే.. తొందరగా హోం లోన్ నుంచి బయటపడొచ్చు. అప్పుడు ఇతర ఆందోళనలు, వడ్డీ రేట్ల పెంపు భయాలు ఉండవు.

97816363

Read Latest

Business News and Telugu News

ఇంకా EMI లు పెంచుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే.. రుణం మొత్తంలో.. సంవత్సరానికి 5 శాతం చెల్లించేలా చూడాలి. ఇలా చేస్తే 20 సంవత్సరాల్లో చెల్లించాల్సిన దాన్ని 12 ఏళ్లలోనే తిరిగి చెల్లించవచ్చు. దీని వల్ల భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేయొచ్చు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం చేయాలి. తొందరపాటు అస్సలు వద్దు.

Also Read:

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు పెంపు.. బ్యాంక్‌లో డబ్బులుంటే అధిక వడ్డీ.. ఇక పండగే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *