Amigos OTT : అమిగోస్ వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

Amigos OTT Streaming Partner: బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం అమిగోస్. పేరు వినడానికే కాస్త వింతగా ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం ఒక పాత్రకు మరో పాత్రకు ఏ మాత్రం సంబంధం లేదని ముందు నుంచే ప్రచారం చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రభుత్వ వ్యాప్తంగా వచ్చేసిన నేపథ్యంలోనే ఈ సినిమా హక్కులు కొనుక్కున్న ఓటీటీ సంస్థ మీద కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ అమిగోస్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతానికి ఉన్న నిర్మాతల ఒప్పందం మేరకు 8 వారాల థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ధియేటర్ల నుంచి ఓటీటీలోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సుమారు 11 కోట్ల మేర ఈ సినిమా హక్కులను రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లకు అమ్మారు. కన్నడ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్, సిద్ధార్థ, మంజునాథ హెగ్డే అనే మూడు భిన్నమైన పాత్రలలో నటించారు.

ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉండగా మరొక రెండు పాత్రలు మరో రెండు భిన్నమైన కోణాల్లో సాగుతాయి. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. గత నెలలోనే మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అయితే అన్ని వర్గాల వారిని విప్పించకపోయినా సినిమా బావుందని టాక్ అయితే థియేటర్లలో వినిపిస్తోంది .

Also Read: Vedha OTT release: నిన్న థియేటర్లో నేడు ఓటీటీలో ‘వేద’.. ఎందులో స్ట్రీమ్ అవుతుందో తెలుసా?

Also Read: PK Rosy Google Doodle: దేశంలోనే మొదటి దళిత నటి.. సినిమాలో నటించిందని ఇల్లు తగలబెట్టేశారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *