Brain Test Video : మన కంటితో చూసే ప్రతీదీ నిజం కాదు. ఎందుకంటే.. ఆ కంటిని, కంటి చూపునూ కంట్రోల్ చేసేది బ్రెయిన్. అంతా బ్రెయిన్ ఆధీనంలో ఉంటుంది. మన శరీరంలో ఏది జరగాలన్నా బ్రెయిన్ ఆదేశాలు తప్పనిసరి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే… మనుషుల్లో కొందరు బ్రెయిన్ లోడి కుడివైపు భాగంతో ఆలోచిస్తారు. మరికొందరు ఎడమవైపు ఉన్న భాగంతో ఆలోచిస్తారు. వారు ఆలోచించే దానికి తగ్గట్టే.. వారికి కనిపించే దృశ్యాలు కూడా ఉంటాయి. అంటే.. ఒకే దృశ్యం.. వేర్వేరుగా కనిపిస్తుంది. అలాంటి ఓ దృశ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోని ట్విట్టర్ లోని ViralPosts5 అకౌంట్‌లో ఫిబ్రవరి 10, 2023న పోస్ట్ చేశారు. ఇదో టిక్ టాక్ వీడియో. 14 సెకండ్ల నిడివి కలిగివుంది. ఇందులో ఓ గుర్రం నడుస్తూ ఉంటుంది. ఐతే… అది ముందుకు నడుస్తోందా… లేక వెనక్కి నడుస్తోందా అన్నది పాయింట్. మీరు కుడివైపు బ్రెయిన్‌తో ఆలోచించేవారైతే.. మీకు గుర్రం.. వెనక్కి నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అదే.. మీరు ఎడమవైపు బ్రెయిన్‌తో ఆలోచించేవారైతే.. మీకు గుర్రం.. ముందుకి నడుస్తున్నట్లు కనిపిస్తుంది.
మనలో కొందరు కాసేపు కుడి, కాసేపు ఎడమ బ్రెయిన్‌తో ఆలోచిస్తూ ఉంటారు. అలా వెంటవెంటనే బ్రెయిన్ పార్ట్స్ మార్చేస్తున్న వారికి.. ఈ గుర్రం కాసేపు ముందుకీ, కాసేపు వెనక్కీ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. మరి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే.. ఆ వీడియోని ఇక్కడ చూడండి
ఈ వీడియోని ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది చూశారు. 1.27 లక్షల మంది లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. “నాకు గుర్రం కూడా కనిపించట్లేదు” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “కొద్దిపాటి ఏకాగ్రతతో మీరు ఎటువైపైనా దాన్ని నడిపించగలరు” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
“నేను బ్రెయిన్ డెడ్ అని అనుకుంటున్నాను” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. “అది మూన్ వాకింగ్ చేస్తోంది” అని మరో యూజర్ కామెంట్ రాశారు.