Hair Fall Remedies: కేవలం 15 రోజుల్లోనే మీ జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టే అద్భుతమైన చిట్కాలు..

Hair Fall Remedies: ఆధుని జీవన శైలికి అలవాటు పడడం వల్ల చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారలు తీసుకుంటున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అయితే జట్టు రాలడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలైతే.. వాతావరణంలో కాలుష్య పెరగడం కూడా ప్రధాన కారణమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జింక్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జట్టు రాలడం, ఇతర సమస్యలతో బాధపడేవారు జింక్‌ అతిగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జింక్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది:

జుట్టు రాలడం ఇతర అనారోగ్య సమ్యలతో బాధపడేవారు ప్రతి రోజూ జింక్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి, జుట్టు కావాల్సిన పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్‌ను వినియోగించడమేకాకుండా వేరుశనగ గల ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే  ఐరన్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, మెగ్నీషియం.. జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

పప్పులు శరీరాన్ని దృఢంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు సీజనల్‌ వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఆహారంలో తప్పకుండా చిక్కుళ్ళులను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో జింక్‌ అధికంగా ఉండడం వల్ల జుట్టు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *