horoscope today 11 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…
horoscope today 11 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కన్యరాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరోజంతా చిత్రా నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఇదే రోజున తెల్లవారుజామున 4:21 గంటల వరకు శూల యోగం ఉంటుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి శనిదేవుని అనుగ్రహం లభించనుంది. ఈ సందర్భంగా ఈరోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. మేషం నుంచి మీన రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా గడుపుతారు. మీ పని వాతావరణం మెరుగుపడుతుంది. అధికారులు, తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు. మీరు ఏదైనా కొత్త పని చేస్తే అందులో విజయం సాధిస్తారు. మరోవైపు మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించొచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శ్రీ క్రిష్ణుడికి వెన్న సమర్పించాలి.
Shukra Gocar 2023 మీనంలోకి శుక్రుడి రవాణాతో ఈ 5 రాశుల వారికి ధన లాభం..! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి…
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు మీ పనుల కోసం ఇతరులపై ఆధారపడొద్దు. ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బందులు పెరగొచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొస్తాయి. విద్యార్థులకు విద్యారంగంలో సానుకూల ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. పిల్లల పురోగతిని చూసి మీ మనసు సంతోషిస్తుంది.
ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు కొందరు మీ పనికి ఆటంకం కలిగించొచ్చు. వారి గురించి పట్టించుకోవద్దు. మీ పనిని ప్రశాంతంగా చేసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, కచ్చితంగా మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకోవాలి. లేదంటే మీరు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు శివ జపమాల పఠించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు నిజాయితీగా పని చేయడం ద్వారా అనేక లాభాలను పొందుతారు. మీరు పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు లక్ష్మీదేవికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొస్తాయి. మీ పనికి సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, మీ తండ్రి మీకు మార్గనిర్దేశం చేస్తారు. ఈ కారణంగా మీ పని ముందుకు సాగుతుంది. విదేశాలలో పని చేస్తున్న వారికి శుభ ఫలితాలొస్తాయి.
ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉంటుంది. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరు పని చేసే ప్రదేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి.
ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.
Mahashivratri 2023 మహాశివరాత్రి రోజున ఈ పరిహారాలతో శని, నాగదోషాలతో పాటు ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు…!
తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు పని గురించి ఇతరులపై ఆధారపడొద్దు. విదేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ ప్రేమ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఓపికగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఉద్యోగులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీ భవిష్యత్తును మార్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈరోజు కొత్త స్నేహితులు ఏర్పడతారు. కుటుంబంలోని సభ్యులందరూ మీతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఈ కారణంగా మీ ప్రాజెక్టులు పూర్తవుతాయి.
ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చాలా కాలం తర్వాత, మంచి సమాచారాన్ని పొందొచ్చు. కొన్ని ముఖ్యమైన పనులను చేయడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. మరోవైపు మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. లక్ష్యాలను సాధించడం ద్వారా మీ మనసుకు సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ఏ ప్రయత్నమైనా మీ జీవిత భాగస్వామి పూర్తిగా సహకరిస్తారు. మీ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మనసులో అనేక గందరగోళాలు ఉంటాయి. ఓ వైపు మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఉంటుంది. మరోవైపు కార్యాలయంలో పనిభారం ఎక్కుగా ఉంటుంది. ఈరోజు మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రభుత్వ రంగంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కోర్టు విషయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారొచ్చు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో తండ్రి సహకారం తోడ్పడుతుంది.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో పనికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు సరైనవని రుజువవుతాయి. మీరు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మీ తండ్రితో మీ సంబంధంలో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు కొన్ని సందర్భాల్లో తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. విద్యార్థులు ఈరోజు కష్టపడి పని చేస్తారు.
ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదాలను పొందుతారు. మీరు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి కొత్త వ్యాపారంలో విజయం సాధిస్తారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావొచ్చు. ఉద్యోగులు స్త్రీల సహకారం వల్ల మంచి లబ్ధి పొందుతారు. మీకు ఏదైనా కొత్త మూలం నుంచి ఆదాయం కూడా పెరుగుతుంది.
ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు విష్ణుసహస్త్రాణం పఠించాలి.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read
Latest Astrology News
and