Hyderabad: బయటకు మాత్రం పూజారి.. లోపల కామాంధుడి అవతారం..

Hyderabad: కొంతమంది బయటకు మంచిగా నటిస్తూ.. తెరవెనుక అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు. సమాజంలో మంచి వ్యక్తిగా కనబడుతూ.. లోపల మాత్రం నేరాలు చేస్తూ ఉంటారు. బయటకు మాత్రం గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం సమాజం తలదించుకునే పనులు చేస్తారు. తాజాగా ఓ పూజారి రాసలీలల వ్యవహారం గుట్టు రట్టయింది. మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా వారి ఆస్తులపై కూడా కన్నేసిన ఓ పూజారి బండారం బయటపడింది

పూజల పేరుతో మహిళలను లైంగికంగా వాడుకోవడంతో పాటు వారిని బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తులు దోచుకుంటున్న ఓ పూజారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఆస్బెస్టస్ కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో వేల్పూరి రాము అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. పేరుకు మాత్రమే ఇతడు అర్చకుడు.. కానీ చేసేవాన్ని పాడు పనులే. గుడికి వచ్చిన మహిళలకు మాయ మాటలు చెప్పి తన వలలో వేసుకుంటున్నాడు. పూజల పేరుతో వారికి దగ్గరవుతాడు. మీ కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తానంటూ నమ్మిస్తాడు.

మహిళలను నమ్మించి లైంగికంగా లొంగదీసుకుంటున్నాడు. శారీరకంగా వాడుకున్న తర్వాత ఆస్తుల తన పేరు మీద రాయాలని మహిళలపై బెదిరింపులకు దిగుతాడు. అతడి వలలో చిక్కుకున్న బాధిత మహిళ ఫిర్యాదుతో పూజారి రాసలీలల వ్యవహారం బయటకొచ్చింది. గుడికి వచ్చిన ఓ మహిళను అర్బకుడు లొంగదీసుకుని శారీరకంగా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఆస్తి తన పేరు మీద రాయాలంటూ బెదిరింపులకు దిగడం స్టార్ట్ చేశాడు. పూజారి వేధింపులు తట్టుకోలేక జగద్గిరిగుట్ట పోలీసులను ఓ మహిళ ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పూజారి వేల్పూరి రాముపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఐపీసీ 417, 354A,376(2)(N),384 r/w,354C,506,109, 66E, 67A సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూజారి రామును అరెస్టు చేసి విచారిస్తున్నారు. పూజారికి సహకరించిన అతడి సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎంతమంది మహిళలను వేధించాడనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని, మాయలో పడి ఇబ్బందులు పడవద్దని సూచిస్తున్నారు. అర్చక వృత్తిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సమాజంలో పూజారులకు ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి అర్బక వృత్తికి ఇలాంటి కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *