IND vs AUS: సిక్సర్లతో షమీ అరుదైన రికార్డు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్టులో 3 సిక్సులు కొట్టిన షమీ.. టెస్టు ఫార్మాట్ లో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో కోహ్లీ, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ లను అధిగమించాడు. మహ్మద్ షమీ ఇప్పటి వరకు 25 సిక్సులు కొట్టడం విశేషం.
ధనాధన్ బ్యాటింగ్…
మూడో రోజు ఆటలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహమ్మద్ షమీ ..ధనా ధన్ బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. షమీ రాణించడంతో భారత్ 400 మార్కును అందుకుంది. ఇదే క్రమంలో ముర్ఫీ వేసిన 131వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దీనికి కంటే ముందే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో మొత్తం మూడు సిక్స్‌లతో విరాట్ కోహ్లీని అధిగమించాడు. టెస్ట్‌ల్లో షమీ ఇప్పటి వరకు 25 సిక్స్‌లు కొట్టగా.. కోహ్లీ(24), యువరాజ్ సింగ్(21), ఇర్ఫాన్ (18), కేఎల్ రాహుల్ (17), పుజారా (15), ధావన్ (12) సిక్సులు బాదారు.
ఇక టెస్టుల్లో అధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్ మన్ జాబితాలో బెన్ స్టోక్స్ … 107 సిక్సర్లతో నెంబర్ వన్ లో ఉన్నాడు. టీమిండియా నుంచి 91 సిక్సులతో వీరేంద్ర సెహ్వాగ్(91) టాప్-6లో ఉన్నాడు.
©️ VIL Media Pvt Ltd.