IND vs AUS: 150 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు 1877లో మొదలైన సంప్రదాయ టెస్టు క్రికెట్ లో కనీవినీ ఎరుగని రికార్డు నమోదయింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఈ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ లో ఏ బౌలర్ కూడా నోబాల్ వేయకుండా ఉండలేడు. అలాంటిది 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఒక్క నోబాల్ కూడా వేయకుండా 30,000 బంతులు బౌలింగ్ చేసిన బౌలర్ గా నాథన్ లియోన్ ఈ రికార్డు సృష్టించాడు.
2011లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన నాథన్ ఇప్పటివరకు 115 టెస్టు మ్యాచులు ఆడి 460 వికెట్లు పడగొట్టాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఇంత స్థిరంగా బౌలింగ్ చేయడం అనేది గొప్ప విషయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
©️ VIL Media Pvt Ltd.