Jupiter-Rahu Gochar: మీనంలో బృహస్పతి, రాహు కలయిక… వీరు రాత్రికి రాత్రే దరిద్రులుగా మారుతారు..

Jupiter And Rahu yuti 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటుంది. ఇది ప్రజలందరిపై శుభ మరియు అశుభ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి తన రాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. మీనంలో ఈ రెండు రాశుల కలయిక వల్ల అశుభకరమైన గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం: బృహస్పతి మరియు రాహు కలయిక కర్కాటక రాశి వారి లైఫ్ లో అనేక కష్టాలను తీసుకురానుంది. ఈ సమయంలో మీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో సహచరులతో వివాదాలు తలెత్తుతాయి. గురు చండాల యోగం మీకు సమస్యలను పెంచుతుంది. 

మిథునం : గురు, రాహువుల కలయికతో గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో మిధున రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మిథున రాశి వారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. షేర్ మార్కెట్‌లో, లాటరీలో పెట్టుబడి పెట్టే ముందు చాలాసార్లు ఆలోచించండి. డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. 

మేషం: మేషరాశిలో బృహస్పతి సంచారం మరియు రాహువు మేషరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి సమస్యలు వస్తాయి. మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం  లోపిస్తుంది. పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురు చండాల యోగం వల్ల అధికారితో వాగ్వాదం రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోండి. 

Also Read: Guru Gochar 2023: పుష్కర కాలం తర్వాత మేషరాశిలోకి గురుడు…ఈ 3 రాశులకు బంపర్ బెనిఫిట్స్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *