అదరగొట్టిన ప్రభుత్వ బ్యాంకులు.. రూ.29 వేల కోట్లు లాభం.. ఏ బ్యాంక్ టాప్‌లో ఉందంటే?

PSU Banks: దేశంలోని ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 65 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. ప్రభుత్వ బ్యాంకుల ఆదాయం రికార్డ్ స్థాయిలో రూ.29 వేల 175 కోట్లకు చేరింది. లాభాల్లో వృద్ధి పరంగా చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఈ బ్యాంకు లాభం 139 శాతం పెరిగింది. దీంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం రూ.775 కోట్లకు చేరింది. ఆ తర్వాత యూకో బ్యాంక్ లాభం 110 శాతం మేర వృద్ధితో రూ.653 కోట్లకు చేరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు లాభాల్లో కూడా 100 శాతానికిపైగా వృద్ధి నమోదు చేశాయి.

మరోవైపు.. ముంబై కేంద్రంగా పని చేస్తున్న యూనియన్ బ్యాంక్ లాభం 107 శాతం పెరిగింది. ఈ బ్యాంకు లాభం రూ.2,245 కోట్లకు చేరింది. ఇండియన్ బ్యాంక్ లాభం 102 శాతం వృద్ధి నమోదు చేస్తూ 1,936 కోట్లకు చేరింది. మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకులు కలిపి రూ.29 వేల 175 కోట్లు లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ లాభంలో 65 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది మూడో త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకులు రూ.17 వేల 729 కోట్లు లాభాన్ని నమోదు చేశాయి.

97837467

ఈ ఆర్థిక ఏడాది తొలి 9 నెలల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు రూ.48 వేల 893 కోట్లు నుంచి 43 శాతం పెరిగి.. రూ.70 వేల166 కోట్లకు చేరాయి. ఈ వార్షిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో రూ.15 వేల 306 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 25 వేల 685 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.29 వేల 175 కోట్లు లాభం వచ్చింది. వరుసగా చూసుకుంటే 9 శాతం, 50 శాతం, 65 శాతం వృద్ధి నమోదు చేశాయి ప్రభుత్వ బ్యాంకులు.

మరోవైపు.. స్థూల, నికర నిరర్ధక ఆస్తులు (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) పరంగా చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువగా కలిగి ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్‌పీఏలు 2.94 శాతంగా ఉండగా.. ఎస్‌బీఐ ఎన్‌పీఏలు 3.14 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 0.47 శాతం, 0.77 శాతంగా ఉన్నాయి.

97840292

Read Latest

Business News and Telugu News

Also Read:

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Also Read:

అలా చేస్తే కంపెనీలకు భారీ లాభాలు.. ఇన్ఫోసిస్ సర్వేలో కీలక విషయాలు..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *