ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్.అబ్దుల్ నజీర్, ప్రస్తుత గవర్నర్‌ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ

Click here to see the BBC interactive

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామాకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదముద్ర తెలిపారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అబ్ధుల్ నజీర్‌ను నియమించారు.

జస్టిస్ అబ్ధుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ కు బదిలీ చేశారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌ బైస్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా త్రివిక్రమ్‌ పట్నాయక్‌, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా శివప్రసాద్‌ శుక్లా, మణిపూర్‌ గవర్నర్‌గా అనసూయ, మేఘాలయకు చౌహాన్, లద్ధాఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలండ్‌ గవర్నర్‌గా గణేశన్‌ను నియమించారు.

ఏపీ కొత్త గవర్నర్ ఎవరు?

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమితులైన ఎస్. అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తి. ‘అయోధ్య తీర్పు’ వెల్లడించిన ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన పదవీ విరమణ చేశారు.

ప్రస్తుత ఏపీ గవర్నర్ గా పని చేస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ అనుసూయ యుక్యేను మణిపూర్ గవర్నర్ గా నియమించారు.

మరోవైపు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించి ఆయన స్థానంలో బీడీ మిశ్రాను గవర్నర్‌గా నియమించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియామకాలు అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది.

(ఈ వార్త అప్ డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

  • తుర్కియే భూకంపం: 15 ఇళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే బతికారు.. అంతా అపార్ట్‌మెంట్ కింద సమాధయ్యారు
  • రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
  • ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి?
  • బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
  • దావూదీ బోహ్రా ముస్లింల కార్యక్రమానికి నరేంద్ర మోదీ ఎందుకు వెళ్లారు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *