మహానటి(Mahanati)సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిన కీర్తీ సురేష్ (Keerthy Suresh)ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంటోంది. చూడటానికి స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించే ఈ సౌత్ బ్యూటీ ఇప్పుడు ఒంటిని తెగ కష్టపెడుతోంది. అందరు హీరోయిన్‌లా జిమ్‌లో వర్కవుట్స్ చేయకుండా నాచురల్‌గా గార్డెన్‌లో యోగా(Yoga)తో కూడిన వర్కవుట్స్, ఆసనాలు వేస్తూ నెటిజన్ల(Netizens)చూపును తనవైపు తిప్పుకుంటోంది. బ్లాక్ కలర్ షార్ట్, టాప్‌పైన రంగుల బన్నీన్ వేసుకొని కష్టమైన ఆసనాలను సునాయాసంగా వేస్తోంది.
kantara-2| Urvashi Rautela: కాంతార-2 మూవీలో ఊర్వశీ రౌతేలా ..రిషబ్ పంత్‌ని వదిలేసి రిషబ్ శెట్టితో జోడినా అంటూ ట్రోలింగ్
మహానటి యోగ ఆసనాలు..
ఎప్పుడూ కూల్‌గా, గ్లామర్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో అప్‌డేట్స్ షేర్ చేసే కీర్తి సురేష్ ఇలాంటి వర్కవుట్ వీడియో షేర్ చేయడంతో నెటిజన్లు కళ్లప్పగించి చూస్తున్నారు. తన ఇంటి లాన్‌లో పచ్చనిలో కీర్తి సురేష్ చేస్తున్న యోగా ఆసనాలు నెటిజన్లనే కాదు ఆమె పెంపుడు కుక్క కూడా అలాగే చూస్తుండిపోయింది. ఈ వీడియోతో పాటు నేను మొదటిసారిగా జంతు ప్రవాహాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నప్పుడు ప్రకృతితో సామరస్యాన్ని కనుగొనడం జరిగిందంటూ ఓ కామెంట్‌ని పోస్ట్ చేసింది కీర్తి సురేష్. ఇప్పుడు ఈ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నానితో కీర్తి సురేష్ ..
ప్రస్తుతం నాచురల్ స్టార్ నానీ దసరాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్ ..మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. అటు తమిళంలో కూడా రెండు, సినిమాలకు సైన్ చేసింది.
వరుస సినిమాలతో బిజీ..
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కీర్తి సురేష్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి చాలా వరకు సక్సెస్ కావడంతో ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో సర్కారు వారి పాటలో తన చలాకీ నటనతో యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలే కాదు గ్లామర్ క్యారెక్టర్స్‌లో ఇరగదీస్తుందని కీర్తి సురేష్ నిరూపించింది. కోలీవుడ్‌లో టాప్ లేడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుధా కొంగరతో వర్క్ చేయడానికి రెడీ అయింది కీర్తి సురేష్. సూరరై పోట్రు, సాలా ఖడూస్, పావా కథైగల్, పుథమ్ పుధు కాధై లాంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు సుధ కొంగర. ఈమూవీని కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హొంబలె ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాబోతోంది.