ఓటీటీలోకి ‘వీర సింహారెడ్డి’ వచ్చేస్తున్నాడు

ఓటీటీలోకి ‘వీర సింహారెడ్డి’ వచ్చేస్తున్నాడు హీరో బాలకృష్ణ ఇటీవల నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. గోపీచంద్‌ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ లో ఈ నెల 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ ‌‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిచారు. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో మూవీని తెరకెక్కించారు. 

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *