తొందరపడ్డ మరో బాలీవుడ్ జంట.. ప్రెగ్నెన్సీ అని తెలిశాకే పెళ్లి.. కేఆర్‌కే ట్వీట్ వైరల్

హిందీ, భోజ్‌పురి సినిమాల్లో నటుడు, నిర్మాత, రచయితగా గుర్తింపు పొందిన కమల్ రషీద్ ఖాన్ (Kamaal R Khan) బాలీవుడ్ సెలబ్రిటీలపై తరచూ విమర్శలు గుప్పిస్తాడని తెలిసిందే. నిత్యం నటీనటులకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అతనికి అలవాటు. తనను తాను క్రిటిక్‌గా చెప్పుకునే కేఆర్‌కే (KRK).. కొత్తగా విడుదలైన సినిమాలపై రివ్యూలు కూడా ఇస్తుంటాడు. ఇక ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక మందన, విజయ్ దేవరకొండ జంట పైనా అవాకులు, చెవాకులు పేలిన కమల్.. తాజాగా బాలీవుడ్‌ న్యూ ట్రెండ్‌పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ముందుగా ప్రెగ్నెన్సీ, తర్వాత పెళ్లి తంతు ట్రెండ్ కొనసాగుతోందని వెల్లడిస్తూ.. రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న జంట కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యిందని కామెంట్స్ చేశాడు.

అయితే కమల్ ప్రస్తుత ట్వీట్ పరిశీలిస్తే.. ఇన్‌డైరెక్ట్‌గా కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) జంటను గుర్తుచేసినట్లుగా ఉంది. ఎందుకంటే బాలీవుడ్‌లో రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న కపుల్ వీరే. మరి కమల్ చెప్పింది వీళ్లిద్దరి గురించేనా? పెళ్లికి ముందే తొందరపడ్డారా? ప్రెగ్నెన్సీ అని తెలిశాకే పెళ్లి చేసుకున్నారా? అనే చర్చ నెట్టింట మొదలైంది. కాగా.. ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా, సిద్ధార్థ్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 7వ తేదీ (మంగళవారం) రాత్రి రాజస్థాన్‌, జైసల్మేర్‌లోని సూర్యఘడ్ కోటలో వీరి పెళ్లి వేడుక జరిగింది.

గతంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటకు కూడా ఇదే విధంగా జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లు డేటింగ్‌లో గడిపిన ఈ స్టార్ కపుల్.. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యి రెండు నెలలు గడవకముందే తాను ప్రెగ్నెంట్ అని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది అలియా. మొత్తానికి ఆరునెలల లోపే 2022 నవంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అంటే అలియా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని తెలియగా.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ నడుస్తోందని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు కమల్ ఆర్ ఖాన్.

ఏదేమైనా బాలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన కియారా, సిద్ధార్థ్‌కు పెళ్లి తర్వాత అభిమానులు, సెలబ్రిటీలు, కోస్టార్స్ నుంచి ప్రశంసలు లభించాయి. అయితే పెళ్లయ్యి వారం రోజులైనా గడవక ముందే కమల్ ఆర్ ఖాన్.. కొత్త జంట అంటూ చేసిన ట్వీట్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. మీకెలా తెలుసు? అని కేఆర్‌కేను ప్రశ్నిస్తున్నారు. కొందరేమో ఇది న్యూ ఫార్ములా కాదు, పాత ఫార్ములానే అని కామెంట్ చేస్తున్నారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *