పాక్ తో హై హోల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా.. స్టార్ ఓపెనర్ దూరం.. తుది జట్లు ఇవే

IND W vs PAK W : భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయంటే ఇరు దేశాల అభిమానులతో పాటు ఇతర దేశాల అభిమానులకు కూడా ఎక్కడ లేని ఆసక్తి. ఇక వీరిద్దరూ ప్రపంచకప్ (World Cup) లాంటి బిగ్ స్టేజ్ పై ఆడుతున్నారంటే వేరే చెప్పాల్సిన పని లేదు. దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా ఆరంభమై మహిళల టి20 ప్రపంకచప్ (Women’s T20 World Cup 2023)లో భాగంగా దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ‘బి’లో భాగంగా మరికాసేపట్లో ఆరంభమయ్యే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న స్మృతి మంధాన ఈ మ్యాచ్ కు దూరమైంది.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ సందర్భంగా స్మృతి మంధాన వేలికి గాయమైంది. దాంతో ఆమె బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ కు దూరమైంది. అయితే ముందు జాగ్రత్తగా ఆమెకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 15న వెస్టిండీస్ తో జరిగే రెండో మ్యాచ్ నాటికి మంధాన ఫిట్ అవుతుందని టాస్ సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది.

ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అయితే గతేడాది జరిగిన మహిళల ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఎంత ఫేవరేట్ అయినా తన రోజు కాని రోజున ఏ జట్టయినా ఓడిపోవాల్సిందే. ప్రపంచకప్ లాంటి ఈవెంట్ కాబట్టి బలహీన జట్టును కూడా తేలిగ్గా తీసుకోరాదు. ఇదే గ్రూప్ లో ఇంగ్లండ్, వెస్టిండీస్ లాంటి మాజీ చాంపియన్స్ ఉండటంతో టీమిండియాకు ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ గా నిలిచింది. ఈసారి మాత్రం కప్పును పట్టే ఇంటికి చేరాలనే పట్టుదల మీద టీమిండియా ఉంది.

తుది జట్లు

టీమిండియా 

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మ, దేవిక వైద్య, స్నేహ్ రాణా, రేణుక సింగ్, పుజా వస్తాకర్, రాజేశ్వరి గైక్వాడ్

పాకిస్తాన్ 

బిస్మా మరూఫ్ (కెప్టెన్), జవారియా ఖాన్,మునీబా,నిదా దార్,  అయేషా నసీమ్,  అలియా రియాజ్, సదియా ఇక్బాల్,  ఐమన్ అన్వర్, నష్రా సంధు, ఫాతిమా సనా,  సిద్రా అమీన్,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *