బ్రదర్స్ బాక్సాఫీస్ ఫైట్.. సొంత అన్నతో పోటీకి దిగుతున్న ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌‌కు‌ (Dhanush) తెలుగు, తమిళ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే రెండు మూడు బాలీవుడ్ మూవీస్‌లో నటించిన ధనుష్.. ‘గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఆయన స్ట్రెయిట్ ఫిల్మ్‌లో మాత్రం నటించలేదు. అయినప్పటికీ ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ సినిమా ఇక్కడ కూడా అదే రేంజ్‌లో ఆడింది. ఈ నేపథ్యంలోనే మొదటిసారి తెలుగు డైరెక్టర్‌తో ఆయన చేసిన బైలింగువల్ మూవీ ‘సార్’ (Sir). భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ (Samyuktha Menon)) ఫిమేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. అయితే ఇదే రోజున మరో సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. అది కూడా ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ (Selva Raghavan) సినిమా కావడం విశేషం.

ధనుష్ చివరి చిత్రం ‘నేనే వరువేన్‌’కు ఆయన సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇది తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో విడుదలైంది. ఇదే కాదు ధనుష్‌‌ నటించిన ‘తుల్లువదో ఇలుమై, కాదల్ కొండేన్, పుదుపెట్టై’ తదితర చిత్రాల డైరెక్టర్ కూడా సెల్వ రాఘవన్. అయితే వచ్చేవారం బాక్సాఫీస్ దగ్గర ఈ అన్నదమ్ముల సినిమాలు పోటీపడబోతున్నాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన బైలింగువల్ మూవీ ‘వాతి/సార్‌’ ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ సెల్వ రాఘవన్ నటించిన ‘బకాసురన్’ (Bakasuran) కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి మోహన్ జి దర్శకత్వం వహించగా.. సామ్ సీఎస్ సంగీతం అందించారు. డైరెక్టర్‌గా విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వ.. ఈ సినిమా ద్వారా నటుడిగానూ సక్సెస్ కావాలని ఆశపడుతున్నాడు.

ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘సార్ (వాతి) ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్నదమ్ముల సినిమాల్లో ఏది మంచి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *