మలయాళ నటుడితో సమంత మధుర ఘట్టమా.. ప్రేమికుల రోజున శాకుంతలం నుంచి రిలీజ్

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్‌లో మైథలాజికల్ ఫిల్మ్‌గా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సైతం ఆ అంచనాలను రెట్టింపు చేసింది. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ శాకుంతలం చిత్రాన్ని నిర్మించగా.. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. అవన్నీ ప్రేక్షకాదరణ పొందగా.. తాజాగా నాలుగో సింగిల్ రిలీజ్ గురించి అప్‌డేట్ ప్రకటించారు మేకర్స్.

శాకుంతం మూవీ నుంచి ‘మధుర ఘట్టమా’ (Madhura Gathamaa) అనే సాంగ్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమంత, దేవ్ మోహన్‌ (Dev Mohan) తో కూడిన రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు అదే రోజున తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల వెర్షన్లు కూడా విడుదల చేయనున్నట్లు సదరు పోస్టర్‌లో పేర్కొన్నారు మేకర్స్.

ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకక్కగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్న ‘మధుర ఘట్టమా సాంగ్’ వారిద్దరి మధ్య రొమాంటిక్‌గా చిత్రీకరించినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో సమంత ఒక చెట్టుకు ఒరిగి ఉండగా.. దేవ్ మోహన్ మోకాళ్లపై కూర్చొని సమంత ఒళ్లో తలపెట్టిన పిక్ చాలా రొమాంటిక్‌గా ఉంది.

సినిమా ప్రత్యేకతల విషయానికొస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ‘శాకుంతలం’ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్, అదితి బాలన్, గౌతమి, సచిన్ ఖేడ్కర్, మధు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. గతంలో ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు సిద్ధమైనప్పటికీ వాయిదాపడగా.. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *