మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కాస్త చేదు వార్తగానే చెప్పాలి. కొద్ది రోజులుగా భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1866 డాలర్లుగా కొనసాగుతోంది. ఇక స్పాట్ వెండి రేటు ఔన్సుకు 22.03 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్ ‌తో పోలిస్తే రూపాయి మారకం రేటు ప్రస్తుతం 82.51 వద్ద అమ్ముడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెంటి రేట్లు తగ్గినప్పటికీ దేశీయ మార్కెట్లలో మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, దిల్లీలో ప్రస్తుతం ధరలు పెరిగాయి. ఇప్పుడు ఏయే ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర తులానికి రూ.220 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 57,380కి చేరింది. అంతకు ముందు రోజు మాత్రం రూ.500 మేర తగ్గడం గమనార్హం. ఇక దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం రూ.52,750కి చేరింది. మరోవైపు.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 20 గ్రాములకు రూ.220 పెరిగింది. ప్రస్తుతం రూ.57,530 వద్దకు చేరింది.

ఇక వెండి విషయానికి వస్తే ఈ మెటల్ ధర కూడూ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో వెండి కిలోకు రూ.70 వేల 500 వద్ద కొనసాగుతోంది. అంతకు ముందు రోజు రూ. 550 మేర దిగివచ్చింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.72 వేల 700 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో రూ.1500 తగ్గిన వెండి ఇవాళ రూ.200 మేర పెరిగింది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు తక్కువగా, వెండి రేట్లు ఎక్కువగా ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నుల ఆధారంగా ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి.

Read Latest

Business News and Telugu News

Also Read:

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు పెంపు.. బ్యాంక్‌లో డబ్బులుంటే అధిక వడ్డీ.. ఇక పండగే!

Also Read:

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు.. హోం లోన్‌పై మాత్రం బంపర్ ఆఫర్.. వారికి మాత్రమే..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *