మోదీ కంటే మన్మోహన్ చాలా బెటర్.. నేను చెప్పేది అబద్దమైతే రాజీనామా చేస్తా: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో చివరిరోజు జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్.. ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ కంటే.. మన్మోహన్ సింగ్ చాలా మెరుగైన పనితనం చూపించారని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే… మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా పనులు చేశారని.. కానీ బయటకు చెప్పుకోలేదని వివరించారు. కానీ.. బీజేపీ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ ఏమీ చేయలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. ఆయన మీద బదనాం పెట్టారంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయాన్ని తాను చెప్పటం కాదని.. ఎంతో మంది మేథావులు చెప్పారని వివరించారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూజా మెహరా రాసిన ద లాస్ట్ డికేడ్ అనే పుస్తకమే.. మన్మోహన్ సింగ్, మోదీల పనితనానికి నిదర్శనమన్నారు.

“ప్రజలు పౌరసత్వం వదులుకొని పోతున్నారు.. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు.. పరిశ్రమలు మూతపడుతున్నాయి.. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది.. వెరసి.. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయట్లేదని దేశ ప్రజలను నమ్మించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫలితంగా.. మోదీ గెలిచారు.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు. ఇందులో భాగంగా మన తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది. తెలంగాణ జీఎస్డీపీ 13 లక్షల కోట్లకు పై చినుకు.. అయితే.. ప్రధాని స్థానంలో మన్మోహన్ సింగ్ ఉన్నా.. మన రాష్ట్ర జీఎస్టీపీ 16 లక్షల కోట్లు ఉండేది. అంటే.. ఒక తెలంగాణ రాష్ట్రమే.. 3 లక్షల కోట్లు నష్టపోయింది. దేశంలోని ప్రతి సెక్టార్ నష్టపోయింది. మన్మోహన్ సింగ్ హయాంలో 14 శాతం అప్పులు తగ్గించారు. మోదీ పాలనలో 54 శాతం అప్పులు పెరిగాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి పతనమైంది.” అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాన్న కేసీఆర్.. తాను చెప్పిన మాటల్లో ఒక్కటి అబద్ధమైనా.. రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ మాత్రం తామే గొప్ప అని జబ్బలు చరుచుకోవటం హాస్యాస్పదమన్నారు కేసీఆర్ ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రముఖ వారపత్రిక ది ఎకానమిస్ట్ ప్రచురించిన కథనాన్ని కేసీఆర్ ఉటంకించారు. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం నుంచి భారతదేశం ఎలా బయటపడబోతోందన్న ఆ వారపత్రిక ప్రశ్నించిందన్నారు. అయితే.. ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడవల్సిన అవసరం ఉండేనని.. కానీ.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు. ఇది పక్కడ పడేది.. నువ్వేంత.. నేనెంతా అనే అవాంఛిత వాదనలు సభల్లో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు విషయం పక్కన పెట్టి.. పార్టీ నేతలు విమర్శించుకోవటం ఆందోళన కలిగించే విషయమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

97829833

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *