రామ్ చ‌ర‌ణ్‌తో ‘నాటు నాటు’ పాటకు ఆనంద్ మ‌హీంద్రా స్టెప్పులు.. ట్వీట్ వైర‌ల్‌

RRR – Ram Charan: దేశంలోనే తొలిసారి హైద‌రాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీక్స్ రేసింగ్ ఘ‌నంగా ముగిసింది. ఈ రేసింగ్‌ను చూడ‌టానికి దేశంలోని ప్ర‌ముఖ సినీ, క్రీడా ప్రముఖులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అలా వ‌చ్చిన వారిలో ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మ‌హీంద్ర ఒక‌రు. ఈవెంట్‌కు వ‌చ్చిన ఆయ‌న రామ్ చ‌ర‌ణ్‌ను ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌టం విశేషం. క‌ల‌వ‌ట‌మే కాదండోయ్‌.. కొన్ని స్పెష‌ల్ పాఠాల‌ను కూడా నేర్చుకున్నార‌ట‌. ఆనంద్ మ‌హీంద్రలాంటి వ్య‌క్తి నేర్చుకున్న పాఠాలేంటి? అనే సందేహం రావ‌చ్చు. అయితే ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే చెప్పారు.

ఇంత‌కీ రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఆనంద్ మ‌హీంద్ర నేర్చుకున్న పాఠాలేంటో తెలుసా!.. డాన్స్ పాఠాలు. RRRలోని నాటు నాటు బేసిక్ స్టెప్స్‌ను రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర నేర్చుకుని త‌న‌తో క‌లిసి స్టెప్స్ వేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకున్నారు. ఇదే సందర్భంలో RRR చిత్రానికి ఆస్కార్ రావాల‌ని కూడా ఆయ‌న యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ ఫ్రీక్స్ రేసింగ్ శ‌నివారం తారాతోర‌ణంతో క‌ళ క‌ళ‌లాడింది. రామ్ చ‌ర‌ణ్‌తో పాటు అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ వ‌చ్చారు. వీరితో పాటు రాకింగ్ స్టార్ య‌ష్‌, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ వ‌చ్చారు. ఇక క్రికెట‌ర్స్ నుంచి అయితే మాస్ట‌ర్ బ్లాస‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, శిఖ‌ర్ ధావ‌న్ విచ్చేశారు.

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. వారిద్ద‌రూ క‌లిసి రేసింగ్ వెహిక‌ల్‌ను కూడా న‌డిపటం విశేషం. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి కూడా. స‌చిన్‌తో ఉన్న ఫొటోల‌ను రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలోనూ షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే RRRతో ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ఐడెంటిటీని సంపాదించుకున్న రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో RC 15 మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం క‌ర్నూలులోని కొండా రెడ్డి బూరుజుపై చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

ALSO READ:

97833000

Read latest

Tollywood updates

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *