Insurance | భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటి నుంచే డబ్బులు పొదుపు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ప్రజలు పోస్టాఫీస్ (Post Office) సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. ఇంకొంత మంది ఒక అడుగు ముందుకు వేసి ఇన్సూరెన్స్ ప్రొడక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రెండు రకాల ప్రయోజనాల ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబానికి ఇన్సూరెన్స్ మొత్తం ఉపయోగపడుతుంది. లేదంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం (Money) పొందొచ్చు.
మీరు కూడా ఇలా ఇన్సూరెన్స్ స్కీమ్‌లో డబ్బులు పెట్టాలని భావిస్తే.. మీకోసం ఒక అదిరే పాలసీ అందుబాటులో ఉంది. ఎగాన్ లైఫ్ ఐగ్యారంటీ మ్యాక్స్ సేవింగ్స్ ప్లాన్ అందిస్తోంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు రోజుకు రూ. 100 పొదుపు చేస్తే రూ. 6.5 లక్షలు పొందొచ్చు. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సమానమైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం చూస్తే.. మీకు ఐగ్యారంటీ ప్లాన్ కింద 6.34 శాతం రిటర్న్ లభిస్తుంది.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్, రూ.3,300 పతనమైన రేట్లు!
అలాగే పాత ట్యాక్స్ విధానం కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందొచ్చు. మీరు ఈ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్‌లో నెలకు రూ. 500 నుంచి కూడా డబ్బులు కట్టొచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అప్పుడు కుటుంబానికి ఒకేసారి కనీసం రూ. 5 లక్షలు లభిస్తాయి. మీరు చెల్లించిన వార్షిక ప్రీమియం మొత్తానికి 11 రెట్లు బీమా వస్తుంది. ఇకపోతే ఈ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. అలాగే వివిధ రకాల డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి పని లేదు. పాన్ నెంబర్ , ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.
రూ.1కే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!
ఉదాహరణకు మీకు 30 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. మీరు ఈ ప్లాన్ తీసుకోవాలని భావించారు. నెలకు రూ. 3 వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాలని భావించారు. పదేళ్ల వరకు డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏడాదికి దాదాపు రూ. 37 వేల ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. పదేళ్ల తర్వాత రిటర్న్ పొందాలని భావిస్తే.. అప్పుడు మీకు చేతికి రూ. 5 లక్షలు వస్తాయి. ఇంకా ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 4.17 లక్షలు ఉంటుంది. 40 ఏళ్ల వరకు కవరేజ్ ఉంటుంది. అలాగే మీరు నెల వారీ ప్రీమియం మొత్తం పెంచుకుంటే.. అప్పుడు మీకు వచ్చే రిటర్న్ కూడా పెరుగుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పైకి చేరుతుంది.