రూ.12 వేల బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ రూ.1,999కే.. భారీ డిస్కౌంట్ ఆఫర్!

Flipkart Offer | మీరు కొత్తగా స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్ ఆఫర్ (0ffer) ఒకటి అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) కళ్లుచెదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. స్మార్ట్‌వాచ్‌పై ఏకంగా 83 శాతం తగ్గింపు లభిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

ఫైర్ బోల్ట్ కంపెనీ వండర్ పేరుతో ఒక స్మార్ట్ వాచ్‌ను అందిస్తోంది. ఇందులో 1.8 ఇంచుల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, కాలిక్యులేటర్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. ఈ ఫైర్ బోల్ట్ బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్ వాచ్‌పై భారీ తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ. 11,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 1,999కే కొనొచ్చు. అంటే ఏకంగా 83 శాతం తగ్గింపు ఉందని చెప్పుకోవచ్చు.

84 రోజులు రీచార్జ్ అక్కర్లేదు.. ఫ్రీకాల్స్, డైలీ 2.5 జీబీ డేటా.. డిస్నీ హాట్‌స్టార్, ప్రైమ్ ఫ్రీ!

అలాగే ఈ స్మార్ట్ వాచ్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అయితే 10 శాతం వరకు తగ్గిపుం వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఏడు రకాల రంగుల్లో లభిస్తోంది. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. 120 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. క్విక్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలారం, వెదర్ అప్‌డేట్స్, వాటర్ రిమైండర్, ఫీమేల్ హెల్త్ కేర్, టైమర్, స్టాప్ వాచ్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రయ్.. రయ్.. మంటూ హైస్పీడ్‌తో దూసుకుపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. గంటకు 115 కి.మి. వెళ్లొచ్చు!

స్మార్ట్ నోటిఫికేషన్స్, ఇన్ బిల్ట్ గేమ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్సీ కలిగి ఉంది. ఎస్‌పీఓ2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేటు ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ స్మార్ట్ వాచ్‌ను చాలా మంది కొనుగోలు చేశారు. మీరు కూడా అందుబాటు ధరలో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలని కోరకుంటే.. దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు. ఇవేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. పలు కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మీరు మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ధర ప్రాతిపదికన ఫీచర్లు కూడా మారుతూ ఉంటాయని గుర్తంచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *