వస్తున్నయ్​ కొత్త విమానాలు

వస్తున్నయ్​ కొత్త విమానాలు న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా భారీ షాపింగ్​కు రెడీ అయింది. జెట్‌‌‌‌లైనర్​ విమానాల కొనుగోలు కోసం ఎయిర్‌‌బస్,  బోయింగ్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది. లోకాస్ట్​ క్యారియర్లతో పాటు ఎమిరేట్స్ వంటి శక్తివంతమైన గల్ఫ్ ఎయిర్‌‌లైన్స్​తో పోటీ పడేందుకు ఈ విమానాలు ఉపయోగపడతాయని భావిస్తోంది. ఒప్పందాలు కుదిరిన మాట నిజమేనని, వచ్చే వారంలో అన్ని వివరాలనూ అధికారికంగా ప్రకటిస్తామని ఎయిర్​ ఇండియా వెల్లడించింది. ఎయిర్‌‌బస్ మొత్తం దాదాపు 250 ఆర్డర్లను, కమిట్‌‌మెంట్లను గెలుచుకుంది. వీటిలో 210 ‘ఏ320’ సింగిల్- ఐల్ ​మోడల్స్​ఉన్నాయి. వీటిని 40 ఏ 350 ఎస్​ వైడ్ -బాడీలతో తయారు చేశారు.  పది 777ఎక్స్​ విమానాలతో పాటు 190 ‘737 మ్యాక్స్’ ఎయిర్‌‌ క్రాఫ్ట్‌‌లను,  మరో 50 డ్రీమ్‌‌లైనర్లను,  20 ‘787’ డ్రీమ్‌‌లైనర్లను.. మొత్తం దాదాపు 290 విమానాలకు బోయింగ్ ఆర్డర్లను దక్కించుకుంది.  ఒప్పందాల గురించి వివరించడానికి ఎయిర్‌‌బస్, బోయింగ్,  ఎయిర్ ఇండియా అధికారులు ముందుకురాలేదు. ఎయిర్ ఇండియా,  దాని పేరెంట్​ కంపెనీ టాటా గ్రూప్ ఈ  భారీ లావాదేవీ గురించి నెలల తరబడి కంపెనీలతో చర్చలు జరిపింది. కొత్త విమానాలు ఇంధన ఖర్చులను తగ్గిస్తాయని, పోటీ పడే సత్తాను పెంచుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. అంతేగాక ఎమిరేట్స్ లేదా ఖతార్ ఎయిర్‌‌వేస్​ల ప్రయాణికులను కూడా ఆకర్షించవచ్చని అంటున్నాయి.   ఎయిర్​ ఇండియా ఇది వరకు దుబాయ్‌‌లోని తన భారీ హబ్‌‌ల ద్వారా అమెరికా, యూరప్‌‌లకు భారతీయులను తీసుకెళ్లేది.

అప్​గ్రేడ్​ తప్పనిసరి… 

కరోనా తర్వాత విమాన ప్రయాణాలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్​లైన్​ క్యారియర్లు తమ విమానాలను అప్‌‌గ్రేడ్, రీఫ్రెష్ చేస్తున్నాయి. అందుకే ఎయిర్​ ఇండియా కొత్త జెట్‌‌ లైనర్ల సరఫరా కోసం ఒప్పందాలను కుదుర్చుకుంది. 2022 డిసెంబరులో చైనా  కరోనా రిస్ట్రిక్షన్లను ఎత్తేసింది. దీంతో ప్రయాణాలు బాగా పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్‌‌బౌండ్ టూరిజం మార్కెట్ మళ్లీ ఓపెన్​ కావడంతో ప్రయాణాలు కరోనా ముందున్న స్థాయికి వస్తాయని భావిస్తున్నారు. అందుకే విమానయాన సంస్థలు లాంగ్​హాల్​ సర్వీసుల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి.  టాటాలు పోయిన ఏడాది కేంద్రం నుంచి ఎయిర్ ఇండియాను కొన్నారు.  సింగపూర్ ఎయిర్‌‌లైన్స్ లిమిటెడ్‌‌తో కలసి నడుపుతున్న విస్తారాతో ఎయిర్ ఇండియాను విలీనం చేస్తామని చెప్పారు. దీంతో సింగపూర్ ఎయిర్‌‌కు కొత్త సంస్థలో 25.1 శాతం వాటా దక్కింది. తాజా ఒప్పందం ఎయిర్‌‌బస్,  బోయింగ్‌‌లకు కూడా ఒక పెద్ద విజయం. ఇవి రెండూ మనదేశంలోనే టాటా గ్రూప్‌‌తో స్థానిక వెంచర్లను నడుపుతున్నాయి.  2019లో ఎయిర్‌‌బస్  బడ్జెట్ క్యారియర్ ఇండిగోకు 33 బిలియన్ డాలర్ల 300 న్యారోబాడీ విమానాలను అమ్మింది. ఎయిర్ ఇండియా  తాజా ఆర్డర్ వల్ల న్యారోబాడీ, వైడ్​బాడీ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌లో ఎయిర్‌‌బస్ మార్కెట్​ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం వైడ్‌‌బాడీ స్పేస్‌‌లో బోయింగ్​ హవా ఉంది.     

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *