సాయంత్రం 5 తర్వాత హెల్మెట్ అవసరం లేదు.. లేడీ పోలీసుల ఆన్సర్‌కు బుర్ర పాడు

ఏమండోయ్ ఇది విన్నారా..! సాయంత్రం ఐదు దాటిన తర్వాత బైకులపై వెళ్లే వారికి హెల్మెట్ అవసరం లేదంటా..!! ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను.. మీకెందుకు చెప్తాను.. సాక్షాత్తూ పోలీసు డిపార్ట్‌మెంటు వాళ్లే చెప్తున్నారు. అది కూడా లేడీ పోలీసులు చెప్పారు. ఏంటీ ఇదంతా ఏదో కామెడీ అనుకుంటున్నారా.. నిజమండీ బాబు. కొత్తగూడెంలో పోస్టాపీస్ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. ఈ క్రమంలోనే వాహనాలు ఆగగా.. ఓ స్కూటీ మీద ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుల్స్ వచ్చారు. అయితే.. వారి పక్కనే ఉన్న తోటి వాహనదారుడు వాళ్లను గమనించాడు. కాగా.. వాళ్లిద్దరిలో ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. దీంతో.. డౌటొచ్చిన ఆ వాహనదారుడు.. తనను తొలుస్తోన్న ప్రశ్నను వెంటనే ఆ లేడీ పోలీసులకు అడిగేశాడు. దానికి వాళ్లు ఇచ్చిన ఆన్సర్ నిజాంగా బుర్రపాడు అయ్యేలా ఉంది.

హెల్మెట్ లేకుండా ఇలా బైక్‌పై తిరగొచ్చా అని లేడీ పోలీసులను ప్రశ్నించాడు వాహనదారుడు. అయితే.. ఆ ప్రశ్నకు లేడీ పోలీసులు.. సాయంత్రం అయ్యింది హెల్మెట్ లేకుండా తిరగొచ్చు. సాయంత్రం ఐదు అయిన తర్వాత హెల్మెట్ లేకున్నా ఏం కాదు.. అని చెప్పటమే కాకుండా.. కావాలంటే నువ్వు కూడా తీసేయ్ అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. వాళ్లిచ్చిన ఆన్సర్‌తో వాహనదారుడికి బుర్రపాడైంది. ఈ తతంగం మొత్తాన్ని ఆ వాహనదారుడు వీడియో తీయగా.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది.

తెలంగాణలో ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు పకడ్బందీ చేస్తూ.. పోలీసులు రకరకాల చర్చలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు పక్కాగా పాటించాలన్న ఉద్దేశంతో.. పోలీసులు చలానాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా చలానాలు విధిస్తూ కొరడా ఝళిపిస్తున్నారు. హెల్మెట్ లేకపోతే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు పోలీసు. ఈ క్రమంలో.. నిబంధనలు పాటించేలా చూసే పోలీసులే పాటించపోవటం.. పైగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం బాధాకరమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

97829833

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *