Vi Offers | ప్రముఖ టెలికం రంగ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న వొడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. వాలెంటైన్స్ డే సందర్బంగా స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా కస్టమర్లకు రెండు రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఉచిత డేటా పొందొచ్చు. ఇంకా రూ. 5 వేల క్యాష్ ప్రైజ్ (Money) గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
వొడాఫోన్ ప్రిపెయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్ లభిస్తోంది. వొడాఫోన్ వీ ట్యూన్స్ లవ్ కాంటెస్ట్ ఒకటి ఉంది. అలాగే ఉచిత డేటా పొందొచ్చు. ఈ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన వారికి రూ. 5 వేలు లభిస్తాయి. వొడాఫోన్ ఐడియా పలు రీచార్జ్ ప్లాన్లపై 5 జీబీ డేటా అదనపు ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 299 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునే వారికి ఈ 5జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
550 టీవీ ఛానళ్లు ఉచితం, 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫ్రీ.. అపరిమిత కాల్స్, ఎంతైనా డేటా వాడుకోవచ్చు!
అంతేకాకుండా రూ. 199 రీచార్జ్ ప్లాన్‌పై కూడా ఆఫర్ ఉంది. అయితే 2 జీబీ ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్లు కేవలం ఫిబ్రవరి 14 వరకే అందుబాటులో ఉంటాయి. ఇంకా వీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటేనే అదనపు డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. రూ. 299 ప్లాన్ కింద అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. ఇంకా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇంకా ఈ ప్లాన్‌పై వీకెండ్ డేటా రోలోవర్, బింగ్ ఆల్ నైట్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రతి నెలా 2 జీబీ బ్యాకప్ డేటా ఉపయోగించుకోవచ్చు.
ఈ సిమ్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్.. కొత్తగా రూ.99 ప్లాన్, నెలంతా మాట్లాడుకోవచ్చు!
అలాగే అదనపు డేటా బెనిఫిట్‌తో పాటుగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు స్పెషల్ వీఐ మ్యూజిక్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. వీఐ యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సోషల్ మీడియాలో దీన్ని నిర్వహిస్తోంది. పాట కరెక్ట్‌గా గెస్ చేసి చెబితే.. వారికి రూ. 5 వేలు లభిస్తాయి. వీఐలవ్‌ట్యూన్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి సాంగ్ పేరు చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ సమాధానం అయితే విజేతగా నిలిచిన వారికి రూ. 5 వేల గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. కాగా ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. అంటే ఇంకో మూడు రోజులే ఈ డీల్స్ పొందగలం. అందుకే రీచార్జ్ అయిపోయి ఉంటే.. ఈ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకోండి. ఇంకా కాంటెస్ట్‌లో పాల్గొని విజేత నిలిచి రూ. 5 వేలు పొందండి.