Flipkart Offer | మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం సూపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. దిగ్గజ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇన్‌ఫినిక్స్ అల్ట్రా జీరో స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకే పొందొచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 32,999గా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 49,999. అంటే మీకు ఈ ఫోన్‌పై 34 శాతం తగ్గింపు ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే.. రూ. 1000 వరకు తగ్గింపు వస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై కూడా ఈ ఆఫర్ ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా ఇదే ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.
మార్కెట్‌లోకి 3 ఇన్ 1 స్మార్ట్ టీవీ.. కేవలం రూ.6,999కే..
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. భారీ ఎక్స్చేంజ్ ఆపర్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 11,999కు సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ కండీషన్ ప్రాతిపదికన మారుతుంది. కొన్ని సార్లు కొన్ని ఫోన్లకు ఎక్స్చేంజ్ ఆఫర్ చాలా తక్కువగా కూడా ఉండొచ్చు.
550 టీవీ ఛానళ్లు ఉచితం, 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫ్రీ.. అపరిమిత కాల్స్, ఎంతైనా డేటా వాడుకోవచ్చు!
ఇకపోతే ఈ స్మార్ట్‌ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 5,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే స్టాండర్డ్ ఈఎంఐ విషయానికి వస్తే.. 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1161 నుంచి ఈఎంఐ పడుతుంది. 24 నెలల టెన్యూర్‌కు అయితే నెలవారీ ఈఎంఐ రూ. 1616 పడుతుంది. 18 నెలల టెన్యూర్‌కు ఈఎంఐ రూ. 2059 చెల్లించాలి. 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3 వేల ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ అమౌంట్ మారుతుంది. అలాగే క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా ఈఎంఐ మారేఛాన్స్ ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో 200 ట్రిపుల్ రియర్ కెమెరా, 180 వాట్ చార్జింగ్ స్పీడ్ వంటి పీచర్లు ఉన్నాయి.