Amigos Movie Day 2: అంచనాలు అందుకునేందుకు కష్టపడుతున్న అమిగోస్.. ఆ సినిమాతో పోలిస్తే దారుణంగా!

Amigos Movie 2 Days Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా వచ్చేసింది. అయితే కళ్యాణ్ రామ్ గతంలో నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అంచనాలు వేశారు కానీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఆ మేర వసూళ్లయితే కనిపించడం లేదు.

ఈ సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు కోట్ల మూడు లక్షల వసూలు చేస్తే రెండవ రోజు కోటి 11 లక్షలు మాత్రమే వసూలు చేసింది. తద్వారా రెండు రోజులుగాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల 14 లక్షల షేర్ ఐదు కోట్ల 25 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇక రెండో రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏరియాల వారీగా వసూళ్లకు వివరాల్లోకి వెళితే నైజాం ప్రాంతంలో 38 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 15 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 14 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 11 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరు జిల్లాలో 10 లక్షలు, కృష్ణాజిల్లాలో 10 లక్షలు, నెల్లూరు జిల్లాలో 6 లక్షలు వెరసి కోటి 11 లక్షల షేర్, కోటి 75 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారతదేశంలో రెండు రోజులుగాను 28 లక్షల షేర్ ఓవర్సీస్ లో 50 లక్షల షేర్ వసూలు రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల 92 లక్షల షేర్ 6 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమా బిజినెస్ 11 కోట్ల 30 లక్షలకు జరగడంతో 12 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు.  

కానీ ఈ సినిమా అంత వసూలు రాబట్టాలంటే ఇంకా ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షలు వసూలు చేయాలి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా అంత వసూళ్లు రాబట్టడం అనేది కష్టమే. నిజానికి బింబిసార విషయానికి వస్తే మొదటి రోజే ఆరు కోట్ల 30 లక్షలు రెండో రోజు నాలుగు కోట్ల 52 లక్షలు వసూలు చేయగా రెండు రోజుల్లోనే 11 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. కానీ అమిగోస్ పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లో హిట్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. 

Also Read: Mahesh Fans in Tension:త్రివిక్రమ్ దెబ్బకు టెన్షన్లో మహేష్ ఫాన్స్.. రెండు పడవల ప్రయాణం అవసరమా?

Also Read: Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *