IND vs AUS: ఫేవరిటిజం వల్లే కేఎల్ రాహుల్‌కి జట్టులో చోటు టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ కేఎల్ రాహుల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేఎల్ రాహుల్ ఎంపిక విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఫైర్ అయ్యాడు. ‘కొంతకాలంగా కేఎల్ రాహుల్ ఆట బాగాలేకున్నా కేవలం పక్షపాతం వల్లే జట్టులో ఉంటున్నాడు. ఎనిమిదేళ్లుగా ఆడుతున్నా సామర్థానికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 46 టెస్టు మ్యాచులు ఆడిన రాహుల్‌కు కేవలం 34 సగటు మాత్రమే ఉంది. రాహుల్ కన్నా మెరుగ్గా ఆడుతున్న వాళ్లు ఉన్నారు. ఫామ్ లో దూసుకుపోతున్నవాళ్లూ ఉన్నారు. వాళ్లందరిని పక్కనబెట్టి రాహుల్ కి ఛాన్స్ ఇవ్వటం కరెక్టు కాదు’ అని అన్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 71 బంతులాడిన రాహుల్ 20 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు బంతుల్ని ఎదుర్కోవడానికి కష్టపడ్డాడు. రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని ఆడించాలని క్రికెట్ విమర్శకులు సూచిస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd.