12వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందాల్సిన పనిలేదు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు కెరీర్‌ను(Career) తీర్చిదిద్దేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. విద్యార్థులు ఏయే రంగాల్లో అద్భుతమైన కెరీర్‌ని సంపాదించవచ్చో తెలుసుకుందాం.
ఫ్యాషన్ డిజైన్(Fashion Design): నేడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ డిజైనింగ్ క్రేజ్ పెరుగుతోంది. యువత నుంచి పెద్దల వరకు అందరికీ ఫ్యాషన్ అంటే పిచ్చి. మీరు ఈ రంగంలో గొప్ప కెరీర్ మొదలు పెట్టవచ్చు. విద్యార్థులు ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ చేయవచ్చు.
పర్యాటకం(Tourism): పర్యాటక రంగం చాలా పెద్ద రంగం. విద్యార్థులు ఈ రంగంలో చాలా అద్భుతమైన కెరీర్ ప్రారంభించవచ్చు. విద్యార్థులు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసి ఈ రంగంలో వృత్తిని సంపాదించుకోవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత.. విద్యార్థులు ఉద్యోగంతో పాటు వారి సొంత పనిని ప్రారంభించవచ్చు.
వెబ్ డిజైనింగ్(Web Designing): నేటి కాలంలో వెబ్ డిజైనింగ్ క్రేజ్ పెరిగింది. 12వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చినా వెబ్ డిజైనింగ్ కోర్సు చేయవచ్చు. నేడు ఇంటర్నెట్‌లో అనేక వెబ్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. విద్యార్థులు ఈ కోర్సు చేసిన తర్వాత ఏదైనా కంపెనీలో వెబ్ డిజైనర్ ఉద్యోగం పొందవచ్చు. ప్రారంభ జీతం గురించి చెప్పాలంటే.. ఫ్రెషర్‌కు నెలకు దాదాపు 22 నుండి 25 వేల జీతం ఇస్తారు.
TS-AP School Holidays: తెలంగాణ-ఏపీ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా స్కూళ్లకు రెండు రోజులు సెలవులు..
సినిమాటోగ్రఫీ(Cinematography) : నేటి కాలంలో సినిమాటోగ్రాఫర్‌కి డిమాండ్ చాలా ఎక్కువ. సైన్స్ మరియు ఫైన్ ఆర్ట్స్ రంగాల విద్యార్థులకు ఇది గొప్ప కెరీర్ ఎంపిక. సినిమాటో గ్రాఫర్ కావడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సినిమాటోగ్రఫీపై పూర్తి పరిజ్ఞానం పొందడం ద్వారా మంచి జీతం పొందవచ్చు.
ఈవెంట్ మేనేజ్‌మెంట్(Event Manager): మీ మాట్లాడే నైపుణ్యాలు అద్భుతంగా ఉంటే.. మీరు ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో మీ కెరీర్ ను ప్రయత్నించవచ్చు. ఈ రంగంలో కోర్సు చేసిన తర్వాత.. మీరు మీ స్వంత స్టార్టప్‌ను కూడా ప్రారంభించవచ్చు. ఇది మీకు ప్రతి నెలా లక్షల రూపాయలను అందిస్తుంది.
యానిమేషన్(Animation): నేడు యానిమేషన్ క్రేజ్ పెరుగుతోంది. యానిమేటెడ్ ఫోటోల నుండి వీడియోల వరకు చాలా వస్తున్నాయి. 12వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఈ కోర్సు చేయవచ్చు. యానిమేషన్ కోర్సు చేసే విద్యార్థులకు ప్రారంభంలో నెలకు దాదాపు 25 నుంచి 30 వేల రూపాయల జీతం లభిస్తుంది.