మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా వచ్చిన ధమాకా (Dhamaka) మూవీ థియేటర్స్ లో ఘనవిజయం సాధించింది. త్రినాథరావు నక్కిన (TrinathaRao Nakkina) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవి తేజ సరసన పెళ్లి సందD భామ శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా నటించి స్పెషల్ అట్రాక్షన్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదలై రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది ధమాకా. విలక్షణ కథకు ఈ సినిమాలోని పాటలు తోడు కావడంతో బ్లాక్ బస్టర్ మూవీగా పలు రికార్డులు క్రియేట్ చేసింది ధమాకా. ముఖ్యంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో బాణీలు తెలుగు ప్రేక్షకుల్లో ఊపు తెప్పించాయి.
చిత్రంలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. ‘దండకడియాల్ .. దస్తి రుమాల్’ సాంగ్ క్లాస్, మాస్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించింది. ఈ పాట లిరికల్ వీడియో ఓ రేంజ్ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాను షాక్ చేసింది. ఈ పాటకి భీమ్స్ సాహిత్యాన్ని అందించడం, సాహితి చాగంటితో.. మంగ్లీతో కలిసి ఆలపించడం విశేషం. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
థియేటర్లలో ఈ పాటకి సాహిత్యం పరంగా, బీట్ పరంగా, కొరియోగ్రఫీ పరంగా ఫుల్ మార్కులు పడటంతో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. మాస్ బీట్ కి తోడు రవితేజ స్టెప్పులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు మాస్ మాహారాజ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓటీటీ వేదికపై ధమాకా హవా నడుస్తోంది. జనవరి 22న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి దిగిన ఈ మూవీ అక్కడ కూడా భారీ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.