Sachin Tendulkar: చరిత్రలో నిలిచిపోయే క్యాచ్.. క్రికెట్ గాడ్ సైతం ఫిదా

ఇదేం క్యాచ్‌(Catch) రా మావా..! ఈ క్యాచ్‌ చూసిన ప్రతి ఒక్కడు ఇదే ప్రశ్న.. షాక్‌ అవ్వడం తప్ప మరో ఆప్షన్‌ లేని పరిస్థితి.. క్రికెట్‌లో ఎన్నో గొప్ప క్యాచ్‌లు చూశాం.. బౌండరీ లైన్‌ వద్ద అదిరిపోయే స్టన్నర్లు చూశాం… లైన్‌ బయట బాల్‌ పడకుండా ఏంజెలో మాథ్యూస్ లాంటి ప్లేయర్లు హ్యాండ్‌తో బంతిని గిరాటేసిన అద్భుతమైన విన్యాసాలనూ చూశాం.. బౌండరీ లైన్‌ వద్ద ఇద్దరు ఫిల్డర్లు సమన్వయంతో క్యాచ్‌లు పట్టిన దృశ్యాలూ చూశాం.. కానీ ఈ క్యాచ్‌ మాత్రం సపరేటు.. అన్ని క్యాచ్‌లు ఒక ఎత్తు.. ఇది మాత్రం మరో ఎత్తు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఈ క్యాచ్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఏకంగా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్(Sachin tendulakar) సైతం ఈ క్యాచ్‌కు ఫిదా ఐపోయాడు.

ఫుట్‌బాల్ బ్యాక్‌వ్యాలీ కిక్‌ క్యాచ్‌:

తన ఫుట్‌బాల్ స్కిల్స్ వాడి ఓ అద్భుతమైన క్యాచ్‌కు హెల్ప్‌ చేశాడో క్రికెటర్‌. ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఈ క్రేజీ క్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాటర్‌ కొట్టిన షాట్‌.. సిక్స్‌ వెళ్లిపోయిందనుకున్నారు.. అయితే పొలార్డ్‌ లాంటి ఓ ఫిల్డర్‌ బౌండరీ లైన్‌ వద్ద ఉండగా.. అది సిక్స్‌ ఎందుకు వెళ్తుంది.. పొలార్డ్‌కు నేను ఏ మాత్రం తక్కువ కాదు అనుకున్నాడో ఏమో.. ఆ బంతిని క్యాచ్‌ చేయడానికి గాల్లోకి ఎగిరాడు ఓ ఫిల్డర్‌.. పట్టుకున్నాడు కూడా.. అయితే బ్యాలెన్స్‌ తప్పి సిక్స్‌ లైన్‌ను టచ్‌ చేయబోయాడు.. ఇక క్రికెట్‌లో లాగానే బాల్‌ను పైకి విసిరేశాడు.. ఇక్కడే ఉంది అసలు షాకింగ్‌ విషయం.. నిజానికి ఇలాంటి ఫీట్స్‌ ఈ మధ్య కాలంలో చాలా కామన్‌ ఐపోయాయి. అయితే అతను చేసిన విన్యాసం మాత్రం మునుపెన్నడూ చూడనిది.

బౌండరీ అవతలకి వెళ్లి బంతిని అందుకున్న ఫీల్డర్‌.. ఇక్కడే తన ఫుట్‌బాల్‌ విన్యాసం చూపించాడు. బౌండరీ లైన్ అవతల కింద పడబోతున్న బంతిని ఫుట్‌బాల్‌లా గాల్లోకి ఎగిరి తన్నాడు. బౌండరీ లైన్‌కి ఇవతల ఇదంతా గమనిస్తున్న మరో ఫీల్డర్, దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. బంతిని గాల్లోకి విసిరేసి ఫుట్‌బాల్‌లోని ఫేమస్‌ బ్యాక్‌వ్యాలీ కిక్‌ను కొట్టిన ఆ ఫిల్డర్‌ విన్యాసానికి సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఫిదా అయ్యాడు. ఫుట్‌బాల్ ఎలా ఆడాలో తెలిసిన వ్యక్తిని క్రికెట్‌లోకి తీసుకొస్తే ఇలాగే జరుగుతుంది…’ అంటూ ఫుట్‌బాల్, క్రికెట్‌తో పాటు పగలబడి నవ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌, కివీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ కూడా పొగడ్తల వర్షం కురిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *