Trigrahi Yog 2023: శని రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని ధనం..

Trigrahi Yog In Kumbh 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఫిబ్రవరి 18న కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. శని, సూర్యుడు మరియు చంద్రుడు కుంభరాశిలో కలిసి ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

మకర రాశిచక్రం

త్రిగ్రాహి యోగం ఏర్పడటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలోని రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. బిజినెస్ భారీగా విస్తరిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. 

మేష రాశిచక్రం

త్రిగ్రాహి యోగం ఏర్పడటం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారులు భారీగా ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

వృషభ రాశి

త్రిగ్రాహి యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ కర్మస్థానంలో  ఏర్పడుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు తీసుకుంటారు. ఏదైనా పనిని మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. 

Also Read; Shukra Gcohar 2023: బృహస్పతి ఇంట్లోకి శుక్రుడు.. ఈరాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ లాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *