సూపర్‌స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. SSMB 28గా తెరకెక్కుతోన్న ఈ సినిమా రీసెంట్‌గా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఓ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 20న స్టార్ట్ చేయబోతున్నారు. వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ సెట్ వేస్తున్నారు. కొన్ని ఎకరాల స్థలంలో రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఇంటి సెట్‌ను వేయిస్తున్నారు నిర్మాతలు.
ఇప్పుడు మహేష్ స్పెయిన్ టూర్‌కి వెళ్లారని సినీ సర్కిల్స్ సమాచారం. ఆయన వచ్చీ రాగానే షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మరి ఈ సినిమాలో విలన్‌గా ఎవరినీ తీసుకురాబోతాడో త్రివిక్రమ్ అని అందరూ అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన గత చిత్రం అల వైకుంఠ పురములో కోలీవుడ్‌కి చెందిన సముద్ర ఖని, మలయాళ నటుడు గోవింద్ పద్మ సూర్య విలన్స్‌గా నటించారు. అయితే ఈసారి త్రివిక్రమ్ పాత సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. ఇంతకీ అదేంటో తెలుసా? ఆయన డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని ఓ సెంటిమెంట్.
అదేదో కాదు.. ఆ మూవీలో మన టాలీవుడ్‌కి చెందిన వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు విలన్‌గా నటించారు. ఆయన్నే ఇప్పుడు SSMB 28లోనూ విలన్‌గా నటింప చేస్తున్నారట మాటల మాంత్రికుడు. సాధారణంగా విలన్స్ అంటే ఇతర భాషా నటులపై టాలీవుడ్ ఆధారపడుతుంది. అదేమైనా తప్పా? అనే ప్రశ్న రావచ్చు. తప్పొప్పులు గురించి ఇప్పుడు మాట్లాడటం కంటే.. మళ్లీ త్రివిక్రమ్ టాలీవుడ్‌కి చెందిన వెర్సటైల్ యాక్టర్‌నే విలన్‌గా చూపించాలనుకోవటం మంచి విషయంగానే పరిగణించవచ్చు.
SSMB 28 రిలీజ్‌ను ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ 28న అనుకున్నారు. కానీ.. షెడ్యూల్స్ అనుకున్నట్లు జరగకపోవటంతో లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ మారింది. దీనిపై నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలోనూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్ట్ 11న SSMB 28ను విడుదల చేయబోతున్నారట. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్‌తో కనిపించబోతున్నారు. సిక్స్ ప్యాక్ పాత్రలో సూపర్ స్టార్ అలరింబోతున్నారని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ALSO READ:
97851289
ALSO READ:
Mrunal Thakur: కాబోయే భర్తపై మృణాల్ కామెంట్స్.. ట్రోలింగ్.. కౌంటర్ ఇచ్చిన బ్యూటీ
ALSO READ: Jagapathi Babu: కమ్మోళ్లనే పనోళ్లుగా పెట్టుకో.. వాళ్లతోనే పడుకో.. కుల పిచ్చిపై జగపతి బాబు ఫైర్
Read latest
Tollywood updates and