ఎల్ఐసీ కొత్త పాలసీ… నిమిషానికి 2-3 ప్లాన్స్ అమ్మేస్తున్న ఏజెంట్లు… బెనిఫిట్స్ ఇవే

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవల జీవన్ ఆజాద్ పేరుతో కొత్త పాలసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ పాపులర్ అవుతోంది. లాంఛ్ చేసిన 10-15 రోజుల్లో 50,000 జీవన్ ఆజాద్ పాలసీలను (LIC Jeevan Azad) అమ్మినట్టు ఎల్ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ ప్రకటించారు. అంటే రోజుకు 3,000 పైనే పాలసీలను అమ్ముతోంది. అంటే నిమిషానికి 2-3 ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీలను అమ్ముతుండటం విశేషం. ఎల్ఐసీ అనేక వర్గాలకు పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో కొన్ని పాలసీలు పాపులర్ అవుతుంటాయి. తాజాగా విడుదల చేసిన ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ కూడా పాపులర్ అవుతోంది. అసలేంటి ఈ పాలసీ? ఈ ప్లాన్ ఎవరికి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? తెలుసుకోండి.

ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ వివరాలు

ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమా బెనిఫిట్స్ అందిస్తుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు. ఇది లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్‌. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీహోల్డర్‌కు బెనిఫిట్స్ అందిస్తుంది ఈ పాలసీ. 90 రోజుల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు జీవన్ ఆజాద్ పాలసీ తీసుకోవచ్చు.

Savings Account: మహిళలు ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగా 5 లక్షల ఇన్స్యూరెన్స్

పాలసీ టర్మ్ 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లు ఉంటుంది. పాలసీహోల్డర్ ఎంత టర్మ్ ఎంచుకున్నా అందులోంచి 8 ఏళ్లు తీసేసి, మిగతా సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 15 ఏళ్ల పాలసీ టర్మ్ తీసుకుంటే 7 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ లభిస్తుంది. లేదా మెచ్యూరిటీ తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.3 లక్షల వరకు సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోవాలనుకునేవారికి మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటే చాలి. రూ.5 లక్షల వరకు సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోవాలనుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి.

LIC Policy: మీ ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? రూ.3,500 వరకు డిస్కౌంట్ పొందండి ఇలా

ఎల్ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్ బ్రోచర్‌లో కంపెనీ వివరించిన ఉదాహరణ ప్రకారం 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 18 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకొని రూ.2 లక్షల బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ప్రతీ ఏటా రూ.12,083 ప్రీమియం చెల్లించాలి. 10 ఏళ్లలో చెల్లించే ప్రీమియం రూ.1,20,830 అవుతుంది. 18 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.2,00,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి రూ.2,00,000 బెనిఫిట్ లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *