ఐఐటియన్‌ను మైక్రోసాఫ్ట్ పీకేసింది.. ట్విట్టర్‌ రెస్పాన్స్ చూసి ఆ ఉద్యోగికి ఆగని కన్నీళ్లు.. ఎందుకంటే?

Microsoft Layoffs: ఐఐటీ పట్టభద్రుడు, మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇప్పుడు ట్విట్టర్‌లో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. కౌత్సువ్ సాహా.. మొన్నటివరకు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో సీనియర్ రీసెర్చర్. ఇప్పుడు ఆ ఉద్యోగం పోయింది. ఇటీవల ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగులకు విధిస్తున్న లేఆఫ్స్‌లో భాగంగా.. మైక్రోసాఫ్ట్ ఇతడిని తీసేసింది. సాహా.. ఐఐటీ ఖరగ్‌పుర్ పూర్వ విద్యార్థి. యూఎస్‌ జార్జియాలోని టెక్ స్కూల్ ఆఫ్ ఇంటరాక్టివ్ కంప్యూటింగ్‌ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాడు. తర్వాత.. మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లో ఉద్యోగంలో చేరాడు. కానీ ఇప్పుడు లేఆఫ్స్‌లో అతడిని తీసేసింది.

దీంతో చాలా మంది మాదిరిగానే సాహా కూడా తనను మైక్రోసాఫ్ట్ ఉద్యోగంలో నుంచి తీసేసిందని, అయితే.. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కానీ.. దానికి తన సన్నిహితులు, ఇతర ట్విట్టర్ యూజర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి కన్నీరు మున్నీరవుతున్నాడు. చాలా మంది తనను ప్రోత్సహిస్తూ, సానుకూల సందేశాలు పంపుతూ అతడిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. దీంతో.. ఇలాంటి రియాక్షన్ తాను ఊహించలేకపోయానని, ఇంతమంది తనకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.

97836786

పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత.. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ టీంలో చేరానని, సంవత్సరం పూర్తి కాకముందే తనను తొలగించడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, దీనిని జీర్ణించుకోలేకపోతున్నానని పోస్ట్ చేశాడు. దీనిపైనే చాలా మంది తనకు ఇతర అవకాశాల గురించి వివరిస్తూ.. గుండె ధైర్యం తెచ్చుకోవాలంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. కొంతమంది సాహా పరిస్థితిని చూసి చింతిస్తున్నట్లు చెప్పగా.. మరికొందరేమో.. అతడితో కలిసి పనిచేయడం ఎంతో నేర్పిందని, అలాంటి వాళ్లను చూసి ఉండమని చెబుతున్నారు. ఈ కష్టసమయంలో తామంతా తోడుగా ఉన్నామని భరోసా కల్పిస్తున్నారు. నీలాంటి రాక్‌స్టార్‌కు మంచి అవకాశాలు దొరుకుతాయంటూ ట్వీట్లు చేస్తున్నారు.

97856935

దీంతో తనకు మద్దతుగా ఇంతమంది నిలుస్తున్నందుకు ఆనందంగా ఉందని మళ్లీ పోస్ట్ చేశాడు సాహా. ఒక్కొక్కరు ఇచ్చే రియాక్షన్ తనను టచ్ చేస్తుందని, దీనిని ఏదో ఒక రోజు తిరిగి అందరికీ చెల్లిస్తానని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. సుమారు 10000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈ జనవరిలో ప్రకటించింది మైక్రోసాఫ్ట్. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితులు లాభాలను అడ్డుకుంటున్నాయని, తమకు ఉద్యోగులను తీసేయడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదని చెప్పింది. ఇదే సమయంలో గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ సహా ఇతర కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్ విధిస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలపై చాలా మంది భయపడుతున్నారు.

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *