కర్నూలు అమ్మాయికి డబ్ల్యూపీఎల్ వేలంలో లక్కీ ఛాన్స్.. ఊహించని ధర!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో కర్నూలు అమ్మాయి అంజలి శర్వాణి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో పోటీపడుతున్న భారత్ జట్టులో మెంబర్‌గా ఉన్న శర్వాణి ఈరోజు రూ.30 లక్షలు కనీస ధరతో వేలంలోకి వచ్చింది. ఫాస్ట్ బౌలర్‌గా ఇటీవల ప్రశంసలు అందుకున్న శర్వాణి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరికి యూపీ వారియర్స్ రూ.55 లక్షలకి ఈ కర్నూలు అమ్మాయిని దక్కించుకుంది.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణి గత ఏడాది చివర్లో భారత ఉమెన్స్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సత్తాచాటిన శర్వాణి మూడు వికెట్లు పడగొట్టింది. ఇప్పటి వరకూ భారత్ తరఫున ఆమె ఆడిన టీ20 మ్యాచ్‌లు కేవలం ఆరు మాత్రమే. కానీ బౌలర్‌గా ఆమె స్కిల్స్‌పై పుణె వారియర్స్ నమ్మకం ఉంచింది. మిగిలిన ఫ్రాంఛైజీలతో పోటీపడి దక్కించుకుంది. వాస్తవానికి చాలా మంది సీనియర్ క్రికెటర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. కానీ పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోయినా.. అంజలి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడటం విశేషం.

పదేళ్ల క్రితం అండర్-19 ఉమెన్స్ జట్టులో ఆడిన ఆడిన అంజలి శర్వాణి.. కొన్ని రోజులు రైల్వేస్‌కి ఆడింది. అనంతరం 2019-2020లో ఆంధ్రా జట్టుకి, ఇండియా-బి జట్టులో ఆడుతూ భారత సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఎట్టకేలకి ఆమె నిరీక్షణ ఫలించి.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపికవడమే కాదు.. తుది జట్టులోనూ అవకాశం దక్కింది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ కాంట్రాక్ట్ కూడా లభించింది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *