కిరణ్ అబ్బవరంకు దక్కిన భాగ్యం.. అన్నామాచార్య వారసుల చేతుల మీదుగా..

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). చాల సింపుల్ స్టోరీలతో పక్కింటి కుర్రాడి తరహా పాత్రల్లో నటిస్తూ కొద్ది కాలంలోనే ప్రేక్షకాభిమానాన్ని సంపాదించాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్.. ఈ ఏడాది ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమాతో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు (Kishore Abburu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇక ఈ సినిమా స్టోరీ తిరుపతితో జరగనుండగా.. ఆదివారం రాత్రి అదే సిటీలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ టీమ్ ‘సోల్ ఆఫ్ తిరుపతి’ పేరుతో నాల్గవ సింగిల్‌ను ఆవిష్కరించింది. శ్రీవిష్ణువుకు వీర భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య ఫ్యామిలీలోని 12వ తరానికి చెందిన వారు ఈ పాటను విడుదల చేశారు. 15వ శతాబ్దంలో వేంకటేశ్వరుని స్తుతిస్తూ సంకీర్తనల రూపంలో అనేక రచనలు రచించి ఆంధ్రపద కవితా పితామహుడిగా పేరొందారు అన్నమయ్య. ఇప్పుడు ఆయన వారసులే సినిమాలో త్రిపతి గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ పాటను విడుదల చేశారు.

చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ‘సోల్ ఆఫ్ తిరుపతి’ పాటకు కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. ముఖ్యంగా ఈ పాట తిరుపతి, వేంకటేశ్వరుని గొప్పతనాన్ని వర్ణిస్తాయి. ఇందులో భావోద్వేగభరిత, ఆలోచింపజేసే సాహిత్యం రెండూ ఉండగా.. నిస్సందేహంగా శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఇక తిరుపతి ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన కిరణ్ అబ్బవరం.. అక్కడ హాస్టల్‌లో చదువుకున్నపుడు చాలాసార్లు గోడలు దూకి వచ్చి సినిమాలు చూసినట్లు గుర్తు చేసుకున్నాడు. తిరుపతిలో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్న హీరో.. సిటీలో ఎక్కడ ఫుడ్ బాగుంటుందో వెల్లడించాడు. తనకు అక్కడ దొరికే గోబీ రైస్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఇక వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకు పనిచేసిన వారిలో ఎక్కువ మంది తిరుపతి వాస్తవ్యులేనని వెల్లడించారు. అంతేకాదు.. ఈ ఆడియో ఫంక్షన్‌కు తిరుపతికి చెందిన ప్రముఖ డైరెక్టర్‌ కిశోర్ తిరుమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కాశ్మీరా పరదేశి ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్2 (GA2) పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన చిత్రానికి అల్లు అరవింద్ సమర్పికుడిగా వ్యవహరించారు. కిరణ్ అబ్బవరం అప్‌కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ‘మీటర్, రూల్స్ రంజన్’ సినిమాల్లో నటిస్తున్నాడు.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *