కోల్కతాలో భారీగా బంగారం పట్టివేత కోల్కతాలో భారీగా బంగారం పట్టుబడింది. 14 కోట్ల విలువ చేసే 24.4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఆపరేషన్ ఈస్టర్న్ గేట్‌వేతో బంగారం గుట్టును రట్టు చేశారు. బంగ్లాదేశ్ నుండి నాటు పడవలో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో అస్సాం, త్రిపుర, కోల్కతా, బంగాదేశ్ లకు చెందిన 8మందిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
©️ VIL Media Pvt Ltd.