Tirumala: త్వరలో భారతదేశంలో క్యాన్సర్ సునామీ రాబోతుందని.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఆసుపత్రి వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని స్పష్టం చేశారు. క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసిన టీటీడీ ఆయుర్వేద హాస్పిటల్ వైద్యులు.. ఈ సంచలన ప్రకటన చేశారు. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే.. క్యాన్సర్ (Cancer) దాడి తప్పదని హెచ్చరించారు. ‘జీవనశైలి వ్యాధులకు ఆయుర్వేద పరిష్కారం’ పేరుతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఒబెసిటీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ సమస్యలకు ఆయుర్వేదం ద్వారా ఇంటి వైద్యంతోనే చెక్ పెట్టొచ్చని.. ఎస్వీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ స్పష్టం చేశారు. అలోపతి వైద్యం తీసుకుంటున్న వారు కూడా ఆయుర్వేద మందులు వాడొచ్చని, తద్వారా జబ్బు మరింత తీవ్రం కాకుండా చూడొచ్చని వివరించారు. నల్లేరు, అలోవెరా, ఆమ్లా, అర్క, జిల్లేడు లాంటి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని వివరించారు. త్వరలోనే TTD ఆయుర్వేదిక్ ఫార్మసీ సెంటర్ 314 రకాల మందులు తీసుకురానున్నట్టు వెల్లడించారు.
గుండెపోటు వచ్చిన సమయంలో బాధితుడికి ప్రాథమికంగా ఎలాంటి చికిత్స అందించాలో.. డాక్టర్ సుభాషిణి వేదికపైనే మాక్ డిస్‌ప్లే చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో CPRద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. అందరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చీజ్, సాల్ట్ వేసిన వేరుశెనగలు, పాస్తా సాస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చాలా కృత్రిమ రంగులు, రుచులు, స్వీటెనర్లు, ప్రిరెజర్వేటివ్‌లు ఉంటాయని.. వివరించారు. వీటిని తీసుకోవడం వల్ల అండాశయం, మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని చెప్పారు. వారసత్వంగా వచ్చే క్యాన్సర్లను నివారించడం కష్టమే కానీ.. జీవనశైలి వల్ల వచ్చే క్యాన్సర్లను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు.
Read Latest
Andhra Pradesh News
and