నష్టాల్లో మార్కెట్లు.. కానీ ఈ 5 స్టాక్స్ దూసుకెళ్తున్నాయి.. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే..!

Breakout Stocks: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 232 పాయింట్లు నష్టపోయి 60 వేల 449 మార్క్ వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్లు పడిపోయి 17 వేల 789 మార్క్ వద్ద కొనసాగుతోంది. టైటాన్ కంపెనీ, లార్సెన్, బజాజ్ ఆటో, ఐటర్ మోటార్స్ ఎన్‌టీపీసీ సంస్థలు సగటున 1 శాతం మేర లాభపడ్డాయి. అయితే, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్ 2 శాతానికిపైగా నష్టాల్లోకి జారుకున్నాయి. అదానీ పోర్ట్స్ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా స్టాక్ మార్కెట్లు క్రితం సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిసాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుందన్న భయాలతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. గత శుక్రవారం సెషన్‌లో అమెరికా నాస్‌డాక్ కంపోజిట్ 0.61 శాతం మేర నష్టపోయింది. అయితే, డౌన్ జోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 0.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.22 శాతం మేర లాభపడడం గమనార్హం. ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.

దేశీయ మార్కెట్‌లో కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.19 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.98 శాతం మేర నష్టాల్లోకి వెళ్లాయి. దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ 5 స్టాక్స్ మాత్రం ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్ నమోదు చేశాయి. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. తమ వాచ్ లిస్ట్‌లో ఈ స్టాక్స్‌ని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ స్టాక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

స్టాక్ పేరు

CMP (రూపాయల్లో)

ధరలో మార్పు (శాతాల్లో)

వాల్యూమ్

One 97 Communications Ltd.

672.9

3.4

32,16,142

Glenmark Pharmaceuticals Ltd.

417.2

4.2

14,98,450

PB Fintech Ltd.

533.2

1.4

18,00,661

Archean Chemical Industries Ltd.

690.8

7.1

4,62,421

Bharat Forge Ltd.

904.5

2.4

7,51,455

గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *