నెట్‌ఫ్లిక్స్‌కు వెంకటేష్ ధమ్కీ.. రానా నాయుడు టైటిల్‌పై ఫైర్.. వీడియో వైరల్

తెలుగు ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించగల నటుల్లో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ఒకరు. మాస్ క్యారెక్టర్లను తన నటనతో ఎంతగా ఎలివేట్ చేయగలరో.. కామెడీ, సెంటిమెంట్‌ను కూడా అంతకంటే ఎక్కువగా పండించగలరు. సోలో హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన వెంకీ.. కొంతకాలంగా మల్టీ్స్టారర్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఎఫ్3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే, ప్రస్తుతం రూటు మార్చిన వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో సైంధవ్ (Saindhav) పేరుతో యాక్షన్ మూవీకి కమిట్ అయ్యాడు. మరోపైపు రానా దగ్గుబాటి (Rana Daggubati) తో కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుది. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కు ధమ్కీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు వెంకీ.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు వెబ్ సిరీస్‌ను ప్రీమియర్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ట్రైలర్‌ కూడా విడుదల చేస్తారని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌లో నాగ నాయుడిగా నటించిన వెంకటేష్ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఫన్నీ బైట్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగా నాయుడి గెటప్‌లో చేతిలో గన్ పట్టుకుని కనిపించిన వెంకీ నెట్‌ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

‘చాల పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్‌ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్‌లో హీరో నేను. అందరి కంటే బడా స్టార్‌నే కాకుండా అందంగా కనిపించేది కూడా నేనే. పైగా ఫ్యాన్స్ కూడా నా వాళ్లే. మరి ఈ షోకు రానా నాయుడు కాకుండా నాగా నాయుడు అని నా పేరు ఉండాలి. బాప్‌కే పంగ నామాలు పెట్టొద్దు. మజాక్ చేయొద్దు’ అని హెచ్చరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్స్‌లో నటించారు. అంతేకాదు ఈ రానా నాయుడు వెబ్ సిరీస్‌ను ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనోవన్‌’కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కింది. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా LLPకి చెందిన సుందర్ ఆరోన్ నిర్మించిన ఈ సిరీస్ ఓటీటీ ప్రీమియర్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు.

ఇవే కాకుండా వెంకటేష్ హిందీలోనూ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం ఈద్ సందర్భవగా ఏప్రిల్ 4న విడుల కానుంది.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *