మరోసారి ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్ ఎన్నికను త్వరగా నిర్వహించాలని కోరుతూ ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది. దీంతో ఈ నెల 16న జరగాల్సిన మేయర్ ఎన్నికను 17 తర్వాత ప్రకటిస్తామని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.
లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎల్జీ (లెఫ్ట్ నెంట్ గవర్నర్) తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఢిల్లీ మున్సిపల్ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది. దీంతో ఎల్‌జీ(లెఫ్ట్ నెంట్ గవర్నర్) కార్యాలయం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్..ఈ నెల16 జరగాల్సిన ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
©️ VIL Media Pvt Ltd.