WPL Auction 2023 : మహిళల ఐపీఎల్ (WPL Auction 2023).. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023 వేలం ముగిసింది. 90 స్థానాల కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా.. ఐదు ఫ్రాంచైజీలు కలిసి 87 మందిని కొనుగోలు చేసింది. టీమిండియా (Team India) స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను అత్యధికంగా రూ. 3.40 కోట్ల ధర పలికింది. ఆమెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్ నర్ ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్.. అంతే మొత్తానికి ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. జెమీమా రోడ్రింగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లకు) ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
తెలుగు ప్లేయర్స్ కు నిరాశ
ఈ వేలం తెలుగు ప్లేయర్స్ కు నిరాశనే మిగిల్చింది. 15 మందికి పైగా ప్లేయర్లు తమ పేర్లను వేలంలో రిజిస్టర్ చేసుకోగా.. కేవలం ఆరుగురు మాత్రమే అమ్ముడయ్యారు. కర్నూలుకు చెందిన అంజలి శర్వాణిని రూ. 55 లక్షలకు యూపి వారియర్జ్ సొంతం చేసుకుంది. గుంటూరు అమ్మాయి సబ్బినేని మేఘనను (రూ.30) గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. విశాఖ పట్నానికి చెందిన స్నేహ దీప్తిని రూ. 30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన అరుంధతి రెడ్డిని రూ. 30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి ఎస్ యశస్రీని రూ. 10 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది. వైజాగ్ కు చెందిన షబ్నమ్ షకీల్ ను రూ. 10 లక్షలకు గుజరాత్ జెయింట్స్ సొతం చేసుకుంది. ఇక ఇటీవలె ముగిసిన అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా జట్టులో భాగంగా ఉన్న గొంగడి త్రిషను ఎవరూ కొనుగోలు చేయలేదు.
ఏ జట్టు ఎవర్ని కొనుగోలు చేసింది
ముంబై ఇండియన్స్ : హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్, కెర్, పూాజా వస్త్రాకర్, వోంగ్, అమన్ జోత్, గుజ్జర్, ఇషాక్, హేలీ మ్యాథ్యూ, హుమైరా ఖాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, జింతమని, నీలం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన, అలీసా పెర్రీ, డివైన్, రేణుక సింగ్, రిచా ఘోష్, బర్న్స్, కసత్, రాయ్, పాటిల్, అహుజ, శోభన, హీథర్ నైట్, డేన్, ప్రతీ బోస్, పూనమ్, కోమల్, మేగాన్ షుట్, సహాన పవార్
యూపీ వారియర్జ్ : ఎకెల్ స్టోన్, దీప్తి శర్మ, ఇస్మాయిల్, హీలీ, గైక్వాడ్, పర్శవి, షెరావత్, యశస్రీ, నగవరి, హ్యారీ, వైద్య, బెల్లె, లక్ష్మి, సిమ్రన్
ఢిల్లీ క్యాపిటల్స్ : తానియా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, శిఖా పాండే, కప్, సాధు, క్యాస్పీ, నోరిస్, హ్యారీస్, జసియా, మని, పూనమ్ యాదవ్, జెస్ జొనాసెన్, స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ
గుజరాత్ జెయింట్స్ : గార్డ్ నర్, సుష్మా వర్మ, బెత్ మూనీ, సథర్ లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, వారెమ్, జోషి, హేమలత, కన్వర్, మోనిక, అలాన కింగ్, హర్లీ గలా, అశ్విణి కుమారి, సిసోడియా, షబ్నం షకీల్