రవితేజ ‘రావణాసుర’ నుంచి క్రేజీ అప్డేట్

రవితేజ ‘రావణాసుర’ నుంచి క్రేజీ అప్డేట్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిలర్ ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌‌‌‌ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ‘ప్యార్‌ లోనా పాగల్‌’ అనే వీడియో సాంగ్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మేరకు సరికొత్త పోస్టర్ ను చిత్రబృదం ట్విట్టర్ వేదికగా వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ క్లాస్ లుక్ లో మాస్ స్టెప్పులేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈసినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కార్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *