శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఇవాళ ఉత్సవమూర్తులకు హంస వాహన సేవ ఉంటుంది. రాత్రి 7 గంటలకు అలంకార మండపంలో పూజలు నిర్వహించిన తర్వాత గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దేవస్థానం తరుపున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ సాయంత్రం హంసవాహనంపై ఆదిదంపతులు ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *